ఈ చిన్న టిప్స్ పాటిస్తే మీ నల్లని పెదవులు ఎర్రగా మారడం ఖాయం.. !!

frame ఈ చిన్న టిప్స్ పాటిస్తే మీ నల్లని పెదవులు ఎర్రగా మారడం ఖాయం.. !!

Suma Kallamadi
కొంతమంది ఆడవాళ్లు చూడడానికి చాలా అందంగా కనిపిస్తారు. కానీ, వారి పెదాల కారణంగా ఆ అందాన్ని కోల్పోతున్నారు. పెదాల నల్లగా మారగడం, పొడిబారడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడాలని ఏవేవో క్రీములు, లిప్ బామ్స్, లిప్ స్టిక్స్ వేస్తూ ఉంటారు.కానీ ఫలితం అనేది ఆ కొంచెం సేపు మాత్రమే ఉంటుంది. దాంతో ఏం చేయాలో తెలియక ఆందోళనతో చింతిస్తుంటారు.అందుకనే మన  ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగిస్తే పెదాలు అందంగా, చూడడానికి ముచ్చటగా కనిపిస్తాయి.. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం..


బీట్‌రూట్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జ్యూస్‌లా తయారుచేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని వడగట్టితే వచ్చే రసంలో స్పూన్ తేనె, కొద్దిగా చక్కెర వేసి పేస్ట్‌లా చేసి పెదాలకు పూతలా వేసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు క్రమంగా చేస్తే నల్లగా ఉన్న పెదాలు ఎరుపుగా తయారవుతాయి. ఇలా చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.ఓ గిన్నెలో 2 స్పూన్ల కొబ్బరినూనె వేసి తరువాత స్పూన్ చక్కెర, చిటికెడు పసుపు కలిపి పెదాలకు ప్యాక్ వేసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే.. పెదాలు మృదువుగా, అందంగా మారుతాయి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో నిల్వచేసుకుంటే.. కొన్ని రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు.

కొబ్బరి నూనెలో కొద్దిగా పెరుగు, గులాబీ నీరు కలిపి పేస్ట్ చేసి పెదాలకు అప్లై చేయాలి. రెండు గంటల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే పెదాలు అందంగా, ఆకర్షణీయంగా మారుతాయి. ఈ లిప్‌స్క్రబ్‌ను ఓ బాటిల్లో పోసి ఫ్రిజ్‌లో భద్రపరచి వారం రోజుల వరకు ఉపయోగించవచ్చు. అలాగే కీరదోసను చెక్కు తీసివేసి ముక్కలుగా కోసి మిక్సీ లో వేసి పేస్ట్ ల చేసుకోవాలి. ఇందులో కొంచెం శెనగపిండి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ ప్యాక్ ను పెదవులు చుట్టూ రాయాలి. ఒక 20 నిముషాలు ఉంచి కడిగితే పెదవుల నలుపుదనం పోతుంది. ఒకవేళ కీర దోస ముక్కలు అవి అందుబాటులో లేకపోతే బంగాళదుంప కానీ, ఆపిల్ ముక్కలు గాని వేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: