అమ్మ : ఇలా చేస్తే డెలివరీ తర్వాత వచ్చే అధిక బరువును తగ్గించుకోవచ్చు..!!

Suma Kallamadi
చాలా మంది ప్రెగ్నెన్సీ టైమ్‌లో బరువు పెరుగుతారు. ఆ తర్వాత డెలీవరి తర్వాత కూడా అదే బరువుతో ఉంటారు. ఈ బరువుని ఎలా తగ్గించుకోవాలో తెలియక ఆలోచనలో పడతారు. అలాంటివారు అధికబరువుని ఎలా తగ్గించుకోవాలో కొన్ని ఈజీ టిప్స్ తెలుసుకోండి.. వీటి వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అవేంటంటే.ముందుగు ఈ టైమ్‌లో ఎంత ఆనందంగా వుంటే అంతే మంచిది. అంతేకానీ, ఉన్న పళంగా బరువు తగ్గడం గురించి ఎక్కువగా ఆలోచించి లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు.కొన్ని రోజులపాటు బరువు తగ్గడం గురించి ఆలోచించకండి. దీని వల్ల లేని పోని  సమస్యలను మీరు తెచ్చుకున్నవారవుతారు. మీరు ఫోకస్ చేయాల్సింది మీ ఆరోగ్యంగా ఉంటూ, పుట్టిన పిల్లలతో హ్యాపీగా ఉండడం. ఎందుకంటే ఈ టైమ్ మీకు మళ్ళీ రాదు. దీన్ని మీరు మళ్ళీ ఎంజాయ్ చేయలేరు.


బరువు కొన్ని రోజుల తరవాతైనా తగ్గొచ్చు. కాబటి ఈ టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దు.ప్రతి రోజూ ఒక ఇరవై నిమిషాలు మీకోసం టైమ్ కేటాయించుకోండి. ప్రజెంట్ మీరు ఉన్న పరిస్థితిలో ఎన్నో విషయాలని బాలెన్స్ చేసుకోవాలి. అలాంటప్పుడు మీరు మెంటల్ గా ప్రిపేర్  అవ్వకపోతే కష్టం. తీరుబడిగా వాకింగ్, ప్రేయర్, మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవ్వడం, ఇంకా చెప్పాలంటే ప్రశాంతంగా స్నానం చేయడం.  మీ ఇష్టం మీ ఇరవై నిమిషాలూ మీరెలా వాడుకుంటారో అలా మీకు ఇష్టమైన పనులు చేయండి. డెలీవరి తర్వాత మీరు, మీ పిల్ల కోసం హ్యాపీగా తినాలి. మీకు మాగ్జిమమ్ న్యూట్రిషన్స్ కావాలి


 ఇప్పుడు హఠాత్తుగా ఫుడ్ తగ్గించడం మంచిది కాదు. దీని వల్ల బరువు పెరుగుతారు కూడా. ఒక్కోసారి మెటబాలిజం కూడా దెబ్బ తింటుంది. మీ  ఫుడ్ హెల్దీ గా బాలెన్స్ గా ఉండేటట్లు చూసుకోవాలి. కాల్షియం, జింక్, మెగ్నీషియం, విటమిన్ బీ6, ఫోలేట్ మీరు తీసుకునే ఫుడ్ లో తప్పనిసరిగా ఉండాలి. మీరు తీసుకునే ఫుడ్ వల్ల మీకు ఆకలి తీరాలి. రుచిగా ఉండాలి, శక్తినివ్వాలి. మీరు చేయగలిగిన పనులని నోట్ పెట్టుకోండి. ఆ పనులు మీరే చేసుకోవాలి. చిన్న చిన్న పనులకు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడడం మంచిది కాదు. వారానికి అరకేజీ తగ్గితే మంచిది. అంత కంటే తగ్గితే పిల్లలకి పాలు సరిపోవు.అలాగే ఎక్కువగా నూనె పదార్ధాలు తినకపోవడం మంచిది.




































మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: