మీ చేతులు మృదువుగా కాంతివంతంగా అవ్వాలంటే ఈ టిప్స్ పాటించండి.. !!

frame మీ చేతులు మృదువుగా కాంతివంతంగా అవ్వాలంటే ఈ టిప్స్ పాటించండి.. !!

Suma Kallamadi
చాలా మంది ఆడవాళ్లు ముఖం మీద తీసుకునే శ్రద్ద చేతుల మీద తీసుకోరు. ఫలితంగా చేతులు పొడిబారిపోయి, రఫ్ గా మారిపోతాయి. ఆడవాళ్లు ప్రతి రోజూ చేసే పని చేతులతోనే కదా. మరి అలాంటి చెతులను నిర్లక్ష్యం చేస్తే ఎలా చెప్పండి..ఎప్పుడు కూడా ఆడవాళ్ళ చేతులనేవి ఎంతో ఒత్తిడిని ఫేస్ చేస్తున్నాయి. ఇంటి పనులు అలాగే ఆఫీస్ పనులకు హెల్ప్ చేస్తున్నాయి.ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల చేతులను తరచూ శానిటైజర్ తో శుభ్రపరచుకోవడం కూడా జరుగుతోంది. చేతులకు కూడా తగినంత కేర్ అవసరం. అందుకోసం.. ఈ కింది టిప్స్ ఒకసారి పాటించి చుడండి. ఒక చిన్నపాత్రలోకి ఉప్పును అలాగే కొబ్బరి నూనెను తీసుకుని బాగా కలపండి. ఇప్పుడు ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని పిండండి. ఈ మిశ్రమాన్ని అరచేతులపై అప్లై చేసుకోండి. అలాగే చేతులకు వెనుకవైపున కూడా అప్లై చేయండి. రెండు నుంచి మూడు నిమిషాలపాటు ఈ ప్రాసెస్ ను ఫాలో అవ్వాలి. ఆ తరువాత ఐదు నిమిషాలపాటు చేతులపై ఈ సొల్యూషన్ ఉండేలా చూసుకోవాలి.

కొంచెం సేపు అయ్యాక  ప్లెయిన్ వాటర్ తో వాష్ చేయాలి.డెడ్ స్కిన్ ను తొలగించేందుకు అదే సమయంలో స్కిన్ ను ఎక్స్ఫోలియేట్ చేసేందుకు నిమ్మరసం హెల్ప్ చేస్తుంది. రఫ్ ఎడ్జెస్ ను స్మూత్ గా మార్చేందుకు కూడా హెల్ప్ చేస్తుంది.ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా,  కాంతివంతముగా మారతాయి. కొబ్బరినూనె అనేది స్కిన్ హైడ్రేషన్ ను పెంపొందించడంలో మెయిన్ రోల్ పోషిస్తుంది. స్కిన్ లో మాయిశ్చర్ లోటు ఏర్పడదు.అందుకనే కొబ్బరినూనెను చేతులపై అప్లై చేసుకోవాలి. ఆ తరువాత గ్లోవ్స్ ను వేసుకోవాలి. రెండుగంటల తరువాత గ్లోవ్స్ తీసేయవచ్చు. రాత్రంతా ఉంచితే మరీ మంచిది. ఈ నూనెలో ఉన్న స్కిన్ కేర్ ప్రాపర్టీస్ ను స్కిన్ గ్రహించగలుగుతుంది.చేతులను విపరీతంగా డ్రైగా మార్చే సోప్స్ లేదా డిటర్జెంట్స్ ను పూర్తిగా అవాయిడ్ చేయండి.

నీళ్ళల్లో ఎక్కువసేపు పనిచేయాల్సి వచ్చినప్పుడు చేతులకు గ్లోవ్స్ ను తప్పనిసరిగా వేసుకోండి.గాలిలోని తేమశాతాన్ని నిలిపి ఉంచేందుకు మీ రూమ్ లో హ్యుమిడిఫయర్ ను ఏర్పాటు చేసుకోండి.ఎయిర్ డ్రయర్స్ తో చేతులను డ్రై చేసుకునే అలవాటును మానుకోండి. టిష్యూస్ ను వాడండి.వారంలో ఒక్కసారి చేతులను ఎక్స్ఫోలియేట్ చేసుకోండి. దాంతో, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చేతులు సాఫ్ట్ గా ఉంటాయి.రోజూ చేతులను మాయిశ్చరైజ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: