చర్మ సమస్యలకు వీటితో చెక్ పెట్టేయండి ఇలా !!

Suma Kallamadi
కొంతమంది ఆడవాళ్ళలో చర్మ సమస్యలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.అలా కొన్ని రకాల స్కిన్ అలర్జీలలో మనం సాధారణంగా చర్మం ఎర్రగా మారటం, దురదలు, వాపులు రావడం చూస్తూ ఉంటాము. ఇలాంటి చర్మ వ్యాధులు తాత్కాలికంగా లేదా తీవ్రంగా సమస్యలకు గురి చేస్తుంటాయి. తాత్కాలికంగా ఏర్పడే చర్మ సమస్యలకు వైద్యుడిని లేదా చర్మ నిపుణులను సంప్రదించాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషదాలను, కొన్ని రోజులు వాడటం వలన స్కిన్ అలర్జీ అలాగే  ఇతరత్ర  చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. !! ముందుగా కొబ్బరినూనె ఇది మన అందరి ఇళ్లల్లో లభించేది. దీనిలో సూక్ష్మ జీవులను చంపే సహజ సిద్దమైన గుణాలను ఉన్నాయి.  కొబ్బరి నూనె చాలా రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒకవేళ మీరు దురదలను కలిగి ఉన్నట్లయిటే, ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనెను గట్టిగా రాయటం వలన దురదల నుండి ఉపశమనం పొందుతారు.




అలాగే చర్మ సమస్యలను కలిగి ఉన్నపుడు మీరు పడుకోటానికి ముందుగా ప్రభావిత ప్రాంతాలలో ఆలివ్ ఆయిల్’తో మసాజ్ చేయండి. అంతేకాకుండా, ఆలివ్ ఆయిల్,  కొబ్బరి నూనె రెండింటిని కలిపి వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు.అలాగే వేప చెట్టు ఉత్పత్తులు యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్,  యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. ఈ గుణాలను కలిగి ఉండటం వలన చర్మానికి కలిగే వివిధ రకాల సమస్యలకు, మొటిమలకు, గజ్జి, తామర వ్యాధులను తగ్గించటానికి వేపను వాడుతుంటారు.తేనే చాలా రకాలుగా చర్మానికి ఉపయోగపడుతుంది.




తేనె సహజ సిద్దమైన ఇంట్లో ఉండే ఔషదం ముఖ్యంగా మొటిమలు, చర్మం  పగిలినపుడు వాటిని తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు. మీ చర్మ సమస్యలను తగ్గించటానికి తేనే,  దాల్చిన చెక్క పొడిని కలిపిన మిశ్రమాలను చర్మానికి వాడండి.అలాగే నిమ్మకాయ విటమిన్ ‘C’లను ఎక్కువగా కలిగి ఉండటం వలన శుభ్రపరిచే గుణాలను కలిగి ఉంటుంది, చర్మ సమస్యలకు ఇది శక్తి వంతంగా పని చేస్తుంది. నిమ్మకాయ నుండి చిన్న ముక్కను కత్తిరించి, ప్రభావిత ప్రాంతంలో రాయటం వలన మీరు చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: