అమ్మ : గర్భిణీ స్త్రీలలో నడుమునొప్పిని తగ్గించే చిట్కాలు.. !!

Suma Kallamadi
కడుపుతో ఉన్నపుడు గర్భవతి మహిళలు చాలా జాగ్రత్తలు వహించాలి.రెండు వారాలకు మించి బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఉంటే వెంటనే మెడికల్ కేర్ తీసుకోవడం అవసరం.అలాగే బ్యాక్ పెయిన్ తో పాటు ఈ సమస్యలు కూడా ఉన్నాయేమో గమనించాలి. అవేంటంటే...వెజీనల్ బ్లీడింగ్, ఫీవర్, మూత్రంలో మంట వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యున్ని తప్పకుండా సంప్రదించాలి.ఈ ప్రెగ్నన్సీకి సంబంధించి బ్యాక్ పెయిన్ ను కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులభంగా తగ్గించుకోవచ్చు అవేంటంటే...ప్రెగ్నన్సీలో బ్యాక్ పెయిన్ నుంచి ఉపశమనం పొందాలంటే ఎక్సర్సైజ్ చేయడం మంచిది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల కండరాలు బలోపెతమవుతాయి.


దాంతో, శరీరం ప్రెగ్నన్సీ సమయంలో తలెత్తే నొప్పులను తట్టుకోగలుగుతుంది. ప్రెగ్నన్సీ సమయంలో నడక అనేది చాలా మంచిది. ప్రీనాటల్ మసాజ్ థెరపిస్ట్ నుంచి ప్రీనాటల్ మసాజ్ వలన కూడా ప్రెగ్నన్సీలో బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. ప్రెగ్నన్సీలో బ్యాక్ పెయిన్ ను డీల్ చేయడానికి మంచి పోశ్చర్ ను మెయింటెయిన్ చేయడం మంచిది. రోజంతా, కుర్చీకే అతుక్కుపోవడం మంచిది కాదు. దీని వల్ల కూడా వెన్నుముక పై ఒత్తిడి పడుతుంది. బ్యాక్ పెయిన్ పెరుగుతుంది. మంచి సపోర్ట్ ను అందించే గుడ్ క్వాలిటీ చైర్ పైనే కూర్చోవాలి. అలాగే ఫుట్ రెస్ట్ ను వాడండి.ఐస్ తో తయారైన కోల్డ్ కంప్రెస్ లతో కూడా బ్యాక్ పెయిన్ తగ్గుతుందని నిపుణుల సలహా .

ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో క్రష్ చేసిన ఐస్ ను నింపాలి. దీన్ని టవల్ లో చుట్టాలి. బ్యాక్ పై దీన్ని ఐదు నుంచి పదినిమిషాలపాటు ఉంచాలి. ఇలా రిపీట్ చేయాలి. రిపీట్ చేసేటప్పుడు మధ్యలో ముప్పై నిమిషాల గ్యాప్ ఉండాలి.టవల్ ను వేడినీటిలో ముంచి అదనపు నీటిని బాగా పిండేయాలి. ఈ తడి టవల్ ను బ్యాక్ పై పదినిమిషాల పాటు ఉంచాలి. ఈ ప్రాసెస్ ను అనేక సార్లు రెండు నుంచి మూడు రోజులపాటు పాటించాలి. ఇప్పుడు చెప్పుకున్న టిప్స్ పాటించడం వల్ల చాలావరకు బ్యాక్ పెయిన్ తో పాటు అబ్నార్మల్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: