ఆడవాళ్ళు కుంకుమ పువ్వును ఇలా కూడా వాడవచ్చు తెలుసా... !!
ఈ ఫేస్ ప్యాక్ పొడి చర్మం ఉన్నవారికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది ఏ కాలంలో అయినా మృదువైన, తేమతో కూడిన చర్మాన్ని అందిస్తుంది. ఒక గిన్నెలో చిటికెడు కుంకుమ పువ్వు, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపాలి. దీనిని ముఖం మీద, మెడకి మాస్క్ లా వేసుకుని కొన్ని నిమిషాల తర్వాత నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండుసార్లు వేసుకుంటే మచ్చలు లేని చర్మం మీ సొంతం అవుతుంది.అలాగే ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ గంధం, రెండు లేదా మూడు కుంకుమ పువ్వు రేకులు, రెండు టీ స్పూన్ల పాలను తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలలో అప్లై చేయాలి. ఆరిన తర్వాత మంచి నీటితో కడుక్కోవాలి. పాలు మీ చర్మానికి తక్షణ మెరుపుని అందిస్తాయి.
ఎండ, పొల్యూషన్ కారణంగా కోల్పోయిన మీ సహజ కాంతిని తిరిగి పొందాలనుకుంటే ఈ ప్యాక్ మీకు హెల్ప్ చేస్తుంది. చిటికెడు కుంకుమ పువ్వు కలిపి నాలుగు టేబుల్ స్పూన్ల పాలను తీసుకుని ముఖం, మెడపై రాసుకుని ఆరిన తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. కుంకుమ పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ముఖంమీద వచ్చే మొటిమల్ని కూడా దరిచేరనీయవు. ముఖంపై ఎక్కువగా మొటిమలు ఉన్నవారు చిటికెడు కుంకుమపూలు తీసుకొని అందులో 3-4 తులసి ఆకులు జత చేసి బాగా మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే మొటిమలున్నాయో అక్కడ అప్లై చేసి ఆరే వరకూ వేచి ఉండి, తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. ఈ విధంగా ప్రతి రోజూ చేస్తుంటే కొద్ది రోజుల్లోనే మొటిమలు మాయం అయిపోతాయి.