ఆడవాళ్ళ వక్షోజాలను సహజంగా తగ్గించుకోవడం ఎలా..??

Suma Kallamadi
ఆడవాళ్ళ అందాన్ని మరింత రెట్టింపు చేసే భాగాలలో స్తనాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.  కానీ కొంతమంది ఆడవాళ్ళలో రొమ్ముల పరిమాణం ఉండాలిసిన వాటి కన్నా ఎక్కువగా ఉంటాయి. దీనితో వాళ్ళు ఆత్మన్యూన్యతకులోనూ అవుతారు. అందుకే ఆడవాళ్ళ స్తనాలు సహజంగా తగ్గించుకోవడానికి  సురక్షితమైన కొన్ని ఇంటి నివారణ పద్దతులు ఉన్నాయి. వీటిని పాటించటం వలన స్తనాలలోని  కొవ్వు తగ్గుతుంది.ఫలితంగా స్తనాలు చిన్నగా, అందంగా మారతాయి అవేంటో చూద్దాం.. !! ఆడవాళ్లు గ్రీన్ టీ తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మాములుగా మన బరువు తగ్గించేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అలాగే ఇది రొమ్ములలోని కొవ్వును కూడా తగ్గిస్తుంది.అంతే కాదు గ్రీన్ టీ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక చెంచా గ్రీన్ టీ ఆకులను వేడి నీళ్లలో వేసి 4-5 నిమిషాలు నానపెట్టి ఆ నీటిని త్రాగండి.ఇలా రోజుకు 4-5 సార్లు త్రాగటం వలన మంచి ప్రభావం ఉంటుంది.అలాగే ఒక గ్లాసు వెచ్చని నీటిలో నిమ్మరసాన్ని, ఒక టీస్పూన్ తేనెని కలుపుకొని త్రాగండి.ఇది రోజూ నిద్రలేచిన వెంటనే వట్టి కడుపుతో తాగాలి.ఇది శరీరం లోని చెడు పదార్థాలను(టాక్సిన్స్) తొలగించి  జీవక్రియను పెంచి బరువును తగ్గిస్తుంది.ఇది త్రాగటం వలన వక్షోజాల కొవ్వుకూడా తగ్గుతుంది
అలాగే కాఫీ లోని కెఫిన్ జీవక్రియను పెంచి కొవ్వును తగ్గించేందుకు తోడ్పడుతుంది.2 స్పూన్ల కాఫీ పొడిలో కొద్దిగా తేనెని కలుపుకొని మీ రొమ్ములపై రుద్దండి. ఇలా 10-15 నిమిషాలు రుద్ది కడగండి. ఇలా తరచూ చేయటంవలన కొవ్వు తగ్గుతుంది.ఫిష్ ఆయిల్ లో ఒమేగా -3 ఫాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.ఇది శరీరానికి చాలా మంచిది మరియు ఈస్ట్రోజెన్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది.


అల్లం మీ రొమ్ముల పరిమాణాన్ని తగ్గిస్తుంది.ఇవి మీ రొమ్ములను తగ్గించటానికి  ఉపయోగపడతాయి అల్లం శరీరంలో జీవక్రియను పెంచడంవలన కొవ్వును తగ్గిస్తుంది. ఒక చెంచా తురిమిన అల్లంను నీటిలో వేసి 10 నిమిషాల పాటు ఉడికించండి. ఈ నీటిని వడకట్టి తేనెని కలుపుకొని త్రాగండి.అలాగే ఆడవాళ్లు ఎంచుకునే బ్రా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. మీ వక్షోజాలకు సరిపడా సైజ్ గల బ్రాను ఎంచుకోవాలి. బ్రా సైజ్ లూజ్ ఉంటే రొమ్ములు మరి పెద్దవిగా కనిపిస్తాయి.అందుకని కరెక్ట్ సైజ్ గల ఇన్నర్ వెర్స్ ఎంచుకుంటే చూడడానికి మీ ఎద అందగా కనిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: