బుడుగు : బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలు పట్టడం మంచిదేనా.. !!!

Suma Kallamadi
అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి పాలు పట్టడం ఎంతో మంచిది. అయితే పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగిన పిల్లలు, మిగతా పిల్లల కంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. తల్లిపాలు తాగిన పిల్లల్లో  రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. మొదటసారి బిడ్డకు ఇచ్చే పాలని ముర్రుపాలు అంటారు. ఈ పాలు చాలా చిక్కగా, అన్ని పోషకాలు కలిగి ఉంటాయి.వీటిలోని బిడ్డకు కావలిసిన అన్ని పోషకాలు లభిస్తాయి.

ఈ పాలు తాగడం వల్ల పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. రోగాల బారిన పడే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే తల్లి, బిడ్డల బంధం బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్‌కు ఒక కారణం కూడా అవుతుంది. తల్లీబిడ్డల మధ్య మొదటి స్పర్శ కొలొస్ట్రమ్ ఏర్పడడానికి కూడా సాయం చేస్తుంది. కొలొస్ట్రమ్‌ను తల్లి తొలి పాలని కూడా చెబుతారు. తల్లి అయిన తర్వాత కొన్ని రోజుల వరకూ కొలొస్ట్రమ్ ఉత్పత్తి అవుతుంది. కొలొస్ట్రమ్ చిక్కగా, జిగటగా, పసుపుగా ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్, ప్రొటీన్, యాంటీ-బాడీస్ నిండి ఉంటాయి. ఇందులో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలు వీటిని సులభంగా జీర్ణం చేసుకోగలరు.

తల్లి మొదట ఇచ్చే పాలను, పిల్లలకు మొదటి వ్యాక్సిన్‌గా కూడా  భావిస్తారు.పాలు తాగించడానికి మాత్రమే తల్లి తన బిడ్డను ఛాతికి దగ్గరగా తీసుకోవడం ఒక్కటే కాదు వారి మధ్య తల్లీబిడ్డ బంధం ఏర్పడడం కూడా చాలా అవసరం.తల్లి పాలు లేకపోతే బిడ్డకు పూర్తి రక్షణ ఉండదని తల్లి అనుకోవాలి.బిడ్డకు తల్లి తొలి పాలు అందించగలిగేలా ప్రయత్నించాలి.కొన్నిసార్లు వేరేలా జరగచ్చు.బిడ్డకు తల్లి పాలు కాకుండా వేరే పాలు ఇస్తే, ఆ బిడ్డ తల్లి పాలకు అలవాటు కాలేదు. స్తన్యం తాగలేదు.అలాంటి స్థితి మరింత ప్రమాదకరం కావచ్చు.అందుకనే బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేష్టకరం.. !!Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: