ఆడవాళ్ళ పాదాల పగుళ్లు తగ్గించుకోడానికి చిట్కాలు.. !!
ఆడవాళ్ళు అందం విషయంలో ఎంత ప్రాధాన్యం ఇస్తారో మిగతా శరీర భాగాలకు విషయంలో కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలి.ముఖ్యంగా కాళ్లకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. అలాంటిది అవే కాళ్లు పగుళ్ల బారిన పడితే చాలా అంద విహీనంగా కనిపిస్తాయి. కాబట్టి పాదాలను అశ్రద్ధ చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. ఇలా పగిలిన పాదాలు చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి.పాదాలు అందంగా ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ క్రింది సూచనలను పాటిస్తే సరి..!
ముఖ్యంగా ఎక్కువ సేపు నిలబడి చేసే పనులకు స్వస్తి పలకాలి.అలాగే బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. సాధారణంగా శరీరంలో,చర్మంలో తేమ తక్కువగా ఉండడం, నీళ్లలో ఎక్కువ సేపు తడవడం వల్ల కాళ్ల పగుళ్లు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని నివారించడం వల్ల కాళ్ల పగళ్లు ఇంకా రాకుండా చేసుకోవచ్చు.వీటన్నింటితో పాటు ఫ్లిప్ ఫ్లాప్స్, శాండల్స్, ఓపెన్ బ్యాక్ షూలు, హీల్స్, టైట్‌గా ఉండే లాగా చెప్పులు వేసుకోవడం వల్ల కాళ్ల పగుళ్లు ఎక్కువవుతాయి. కాబట్టి వాటిని ధరించకుండా కాళ్లకు పూర్తి రక్షణను అందించే చెప్పులు ధరించాలి.రాత్రిపూట పడుకొనే ముందు వ్యాజిలెన్ లేదా ఇతర చర్మ క్రిములు పూసి కొద్దిసేపు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు రక్తం సరఫరా అయ్యి పగుళ్ల తగ్గుతాయి.
గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే పాదాలు మృదువుగా మారుతాయి.మడమలు, పాదాల వేళ్ల మధ్య సందుల్లో ఇలా అన్ని చోట్ల మసాజ్ చేసుకోవాలి. తర్వాత నిమ్మరసంలోని ఆమ్ల గుణాలు రఫ్‌గా, పొడిగా ఉన్న మన చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. అదే నిమ్మరసంలో కాస్త గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి పగుళ్లకు అప్లై చేయండి. మీ సమస్య కొంతవరకు తీరుతుంది. టేబుల్ స్పూన్ ఉప్పు,అర కప్పు నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్, రెండు టీస్పూన్ల రోజ్ వాటర్, గోరు వెచ్చని నీళ్లు, ఫుట్ స్క్రబ్బర్.. వీటిని రెడీ చేసుకోవడమే. ఆ తర్వాత ఒక బేసిన్లో నీళ్లు నింపి.. అందులో ఉప్పు, నిమ్మరసం, గ్లిజరిన్, టీ స్పూన్ రోజ్ వాటర్‌ను కలిపి అందులో కాళ్లను నానబెట్టాలి.ఇలా కనీసం వారానికి మూడు సార్లు అయిన చేస్తే మంచిది ఫలితం ఉంటుంది..