గేమ్ ఛేంజర్ : రెండు క్రేజీ అప్డేట్స్.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కియార అద్వానీ ఈ సినిమాలో చరణ్ కి జోడిగా నటించింది. అంజలి ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ , సునీల్ , వెన్నెల కిషోర్ , నవీన్ చంద్ర , జయరాం ముఖ్య పాత్రలలో నటించారు.

ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా నిన్న రాత్రి ఈ మూవీ బృందం వారు రాజమండ్రి లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇక చాలా రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకి ఆనందించిన నాలుగు లిరికల్ వీడియో సాంగ్స్ ను విడుదల చేశారు.

ఇక నిన్న జరిగిన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో రెండు పాటలను విడుదల చేశారు. ఈ రెండు పాటలతో కలిపి మొత్తం ఆరు పాటలను కలిగిన జూక్ బాక్స్ ను ఈ రోజు మేకర్స్ విడుదల చేశారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను మూవీ బృందం వారు తాజాగా పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఆ విషయాన్ని కూడా మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: