నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు.. హనీ రోజ్ సంచలన ఆరోపణలు

MADDIBOINA AJAY KUMAR
సినీ నటి హనీ రోజ్ అంటే తెలియని వారుండారు.. అలాగే ఈమె పేరుకు పరిచయం కూడా అక్కర్లేదు. హనీ రోజ్ 2005లో మలయాళంలో విడుదలైన బాయ్ ఫ్రెండ్ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఆమె మలయాళంతో పాటు క‌న్నడ‌, త‌మిళ‌, తెలుగు సినిమాల్లో కూడా నటించింది. హనీ రోజ్ తెలుగులో తొలిసారి ఆల‌యం, ఈ వ‌ర్షం సాక్షిగా సినిమాల్లో నటించింది. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన వీర సింహారెడ్డి 107వ సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటించారు.
హనీ రోజ్ 14 ఏళ్ల వయస్సులోనే తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈమె నటనకు, అందానికి ఫాన్స్ కూడా ఉన్నారు. అయితే ఈ నటి ఈ మధ్యకాలంలో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డిలో బాలయ్య సరసన నటించి కేరీర్ లో అతి పెద్ద హిట్ సినిమాను సొంతం చేసుకుంది. దీంతో ఈ భామకు ఇప్పుడు డిమాండ్  కూడా పెరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ బ్యూటీ కి సోషల్ మీడియాలో కూడా ఫాన్స్ ఎక్కువైపోయారు.
అయితే తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్టులో.. తనను ఓ బిజినెస్ మ్యాన్ వెంబడిస్తున్నాడాని రాసుకొచ్చింది. అలాగే తనని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపింది. గతంలో హనీ రోజ్ ఓ వ్యక్తి నిర్వహించిన ఈవెంట్ కు వెళ్ళింది అంట. అయితే అప్పటినుంచి ఆ వ్యక్తి తన వెంటపడుతూ.. సోషల్ మీడియాలో కూడా తన పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడని.. ఆ వ్యక్తిపై చట్టపరంగా పోరాడుతానని నటి హనీ రోజ్ తెలిపింది. ఇక ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: