అమ్మాయిల అందాన్ని మెరుగుపరిచే బీట్ రూట్ చిట్కాలు... !!

Suma Kallamadi

ఆడవాళ్లు అందంగా ఉండడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ  ఉంటారు. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగడం, మార్కెట్లో దొరికే ఖరీదైన ఫేస్ క్రీమ్ ని వాడడం ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి తెలియని రహస్యం ఒకటి ఉంది. అందం కోసం ఎక్కడికో వెళ్ళలిసిన పని లేదు, ఏవేవో క్రీములూ వాడి డబ్బులు వృధా చేయాలిసిన పని లేదు. మనకు అందుబాటులో ఉండే బీట్ రూట్ ఉపయోగించి అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఒక  గుప్పెడు ఓట్స్‌నీ, బీట్‌రూట్‌ ముక్కల్నీ తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని ముఖానికి రాసుకుని మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. తరవాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. రెండు నిమిషాలాగి నీళ్లను మరిగించి, ముఖానికి ఆవిరిపడితే సరి... చర్మం కాంతులీనుతుంది.

 

 

 


బీట్‌రూట్‌ ముక్కని మెత్తని పేస్ట్‌లా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ, చేతులకూ రాసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం బిగుతుగా మారి ముడతల సమస్య దూరమవుతుంది.బీట్‌రూట్‌ రసానికి కొంచెం తేనె కలిపి, పెదాలకు రాసుకుని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు రాస్తే పెదాలు మృదువుగా, ఎర్రగా  మారతాయి.

 

 

 

 

బీట్‌ రూట్‌ రసంలో కొంచెం పెరుగూ, బాదం నూనె, చెంచా ఉసిరి కాయ  పొడి కలిపి పేస్ట్‌లా చేసుకుని, దాన్ని తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఎదుగుదుతుంది. అది కండిషనర్‌గానూ ఉపయోగపడుతుంది.జుట్టు తెల్లబడిందనో, నల్లని  రంగులో కనిపించాలనో భావించే వారు రసాయనాలు కలిపిన రంగుల్ని వాడే బదులు బీట్‌రూట్‌ రసాన్ని వారానికోసారి తలకు పట్టించి, అరగంట ఆగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు నల్లని  రంగులో కనబడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: