ఆడవాళ్ళ అందాన్ని మరింత రెట్టింపు చేసే చిట్కాలు.. !!

Suma Kallamadi

ఆడవాళ్ళకి అందంగా  ఉండాలంటే  మహా ఇష్టం. ఆ అందాన్ని కాపాడుకోడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే మీ కోసం కొన్ని చిట్కాలు..  ముఖం మీద ముడతలు, నల్లని మచ్చలతో ఇబ్బంది పడేవారు బొప్పాయిపండు గుజ్జుని కళ్ళకి తగలకుండా ముడతలు, మచ్చల మీద రాసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగితే ముడతలు ,నల్ల మచ్చలు తొలగి పోతాయి.
పచ్చి శనగపప్పు రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం రుబ్బి అందులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత మంచినీటితో కడిగితే ముఖం కాంతి వంతమవుతుంది.

 

 


ముఖ  కాంతితో మెరవాలంటే తులసి ఆకుల గుజ్జును నిద్రకు ముందు ముఖానికి పట్టించి ఉదయం లేవగానే చన్నీటితో కడిగితే ముఖం కాంతివంతం అవుతుంది.మొటిమల బాధితులు తాజా పెరుగులో కొద్దిగా శనగపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని    తర్వాత చన్నీటితో కడిగితే ఎంతటి మొండి మొటిమలైనా మాయమవుతాయి. అలాగే వేధించే మొండి మొటిమలకు పండిన టమాటా లేదా వెల్లుల్లి లేదా పుదీనా రసం  రాసి బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు మాయం కావాల్సిందే.అలాగే ఆడవాళ్లకు ఇష్టం అయిన జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి.

 

 

 

 పెరుగు, గోరింటాకు, గుడ్డు తెల్లసొన కలిపి రాత్రంతా నాననిచ్చి ఉదయాన తలకు పట్టించి ఆరిన తర్వాత కుంకుడుగాయ రసంతో తలస్నానం చేస్తే ఎంతటి మొండి చుండ్రయినా మాయం కావాల్సిందే. అలాగే వేపాకు వేసి కాచిన నీటితో తలస్నానం చేస్తే చుండ్రు మటుమాయం.
నిర్జీవంగా మారి రాలుతున్న జుట్టుకు ఎండు సీతాఫలం గింజల పొడి కలిపిన కొబ్బరి నూనె రాస్తుంటే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.కాలుష్యం బారిన పడిన జుట్టు తిరిగి మెరవాలంటే క్యాబేజి ఆకు రసాన్ని మాడు, జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరగటమే గాక మెరుస్తుంది.
నల్లని జుట్టు కోరేవారు నిమ్మరసం, తులసి, కరివేపాకు కలిపి నూరి తలకు రాస్తే మంచి గుణం కనిపిస్తుంది.చిన్న వయసులో జుట్టు నెరిసిన వారు ఆహారంలో తరచూ పాలకూర తీసుకొంటే జుట్టు నెరుపు తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: