చుండ్రు సమస్యతో బాధపడే వాళ్ళకి చక్కటి పరిష్కారం... !!
ఇప్పుడు ఆడవాళ్ళని వేధిస్తున్న సమస్య చుండ్రు. తలలో చుండ్రు ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలే వేసవికాలం ఉక్కపోతాఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మరి చిరాకు వస్తుంది. అందుకే ఈ చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందేలా కొన్ని చిట్కాలు చూద్దాం... !కొంచెం బేకింగ్ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం మంచిది.
ఆరు చెంచాల నీటిలో రెండు చెంచాల వెనిగర్ కలిపాలి. ఇప్పుడు షాంపూతో తలస్నానం చేశాక ఆ నీటితో తలని కడగాలి. వారానికి ఓ సారి ఇలా చేస్తే త్వరలోనే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
పుల్లగా ఉండే పెరుగులో నిమ్మరసం కలిపి తలకు రాయాలి. ఆరాక తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే తలలోని చుండ్రు దూరమవ్వడమే కాకుండా జుట్టు కూడా కాంతివంతంగా ఉంటుంది.
యాపిల్ సైడర్ వెనిగర్‌తో కూడా చుండ్రు సమస్యని తగ్గించుకోవచ్చు. రెండు స్పూన్ల యాపిల్ సైడర్, వెనిగర్‌ని షాంపూ లేదా కొబ్బరినూనెలో కలిపి రాయాలి. ఇలా చేసిన తర్వాత ఇబ్బంది లేదనుకుంటే రాత్రంతా ఉంచేసుకోవచ్చు. లేదా అరగంట తర్వాత తలస్నానం చేసేయొచ్చు. ఈ రెమిడీ కూడా డాండ్రఫ్‌ని పోగొట్టడంలో మంచిగా పనిచేస్తుంది.
ఉసిరి పొడి, ఉసిరి రసం ఏదైనా సరే అందులో కాసింత నిమ్మరసం కలిపి రాయాలి. ఆరిన తర్వాత తలస్నానం చేస్తే జుట్టు సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి. కాబట్టి రెగ్యులర్‌గా ఈ రెమిడీని వాడొచ్చు. ఇలా ఇంట్లోనే ఉండే వాటితో చిన్న చిన్న చిట్కాలు పాటించటం ద్వారా చుండ్రు సమస్య తగ్గుతుంది.