పేరుకు తెలుగు పంతులు... చేసేవి శృంగార కార్య కలాపాలు.. జనం ఏం చేశారంటే..?
ఆయనో తెలుగు పంతులు. మాతృ భాష తో పాటు పిల్లలకు సంస్కారం నేర్పాల్సిన వాడు. కానీ ఆయనే తప్పుదారి పట్టాడు. ఆడపిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే...పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికపై అదే బడిలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కొయ్య లక్ష్మయ్య అత్యాచారం చేస్తున్నాడు.
దేవరపల్లి మండలం త్యాజంపూడికి చెందిన కొయ్య లక్ష్మయ్య 2012 నుంచి సంబంధిత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. నాలుగు నెలల క్రితం పాఠశాలలో బాలికపై లక్ష్మయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. రెండు రోజుల కిందట ఈ విషయం బాలిక ఇంట్లో తెలిసింది. సోమవారం ఆమె కుటుంబసభ్యులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.
బాధితురాలి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సోమవారం ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.అయితే.. ఉపాధ్యాయుడి వర్గీయులూ అక్కడికి వచ్చారు. బాలిక కుటుంబీకుల దాడి నుంచి ఆయన్ను తప్పించి తరగతి గదిలోకి తీసుకువెళ్లి గడియ పెట్టారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సమిశ్రగూడెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని ఇరువర్గాలవారిని శాంతింపజేశారు.