టేస్టీ టేస్టీ `ఆలూ పెస‌ర‌ప‌ప్పు`

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
పెసరపప్పు- ఒక కప్పు
బంగాళాదుంపలు- రెండు
అల్లం త‌రుగు- ఒక టీస్పూను
కరివేపాకు- రెండు రెమ్మలు

 

టొమాటో- రెండు
పచ్చిమిర్చి- ఐదు
మెంతులు- కొద్దిగా
పసుపు- చిటికెడు

 

నూనె - అర టీస్పూన్‌
ఉప్పు - తగినంత 
నీళ్లు- ఒక కప్పు

 

ఆవాలు- అర టీ స్పూన్‌
జీలకర్ర - అర‌ టీస్పూన్‌
కొత్తిమీర- కొద్దిగా

 


తయారీ విధానం: 
ముందుగా పెస‌ర‌ప‌ప్పు మ‌రియ బంగాళ‌దుంప‌ల‌ను విడివిడిగా ఉడికించి ప‌క్క‌న‌ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర, మెంతులు, పసుపు వేసి వేగించాలి. రెండు నిమిషాల తరువాత దానిలో టొమాటో, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి కొంత స‌మ‌యం మగ్గనివ్వాలి.

 

అవి వేగాక ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, పెసరపప్పు కూడా వేసి పది నిమిషాలు ఉడికించాలి. ఒకవేళ పప్పులో నీళ్లు సరిపోకపోతే అప్పుడప్పుడు పోస్తుండాలి. ఇక స‌రిప‌డా ఉడికాక చివ‌రిలో కొద్దిగా కొత్తిమీర వేసి క‌లిపి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే, వేడి వేడి ఆలూ పెసర పప్పు రెడీ..!

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: