ఎలాంటి టెస్ట్‌లు లేకుండా గ‌ర్భ‌వ‌తా.. కాదా.. అన్న‌ది ఇలా సులువుగా చెప్పేయ‌వ‌చ్చు..!

Kavya Nekkanti

గ‌ర్భం అనేది మహిళ జీవితంలోని ముఖ్యమైన ఘట్టం. ఈ దశలో గర్భిణీ ఎంతో ఆనందాన్ని పొందుతుంది. మరొక ప్రాణికి జన్మనిచ్చే వరం పొందిన స్త్రీని ఈ దశలో కుటుంబీకులు సైతం అల్లారుముద్దుగా చూసుకుంటారు. గర్భం ధరించాలని.. అమ్మా.. అని పిలిపించుకోవాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. ఈ విష‌యాల‌న్నీ ప‌క్క‌న పెడితే.. ప్రెగ్నెన్సీ వ‌చ్చిందో, రాలేదో తెలుసుకునేందుకు నేడు మ‌హిళ‌ల‌కు ఎన్నో ర‌కాల ప‌ద్ధ‌తులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నిఇంట్లో చేసేవి అయితే కొన్ని ప‌రీక్ష‌లు హాస్పిట‌ల్స్ లో చేసి వారికి గ‌ర్భం వ‌చ్చిందో, రాలేదో చెబుతారు.

 

అయితే ఎలాంటి ప‌రీక్ష చేయ‌కుండానే మ‌హిళ‌లు త‌మ‌కు గ‌ర్భం వ‌చ్చిందో, రాలేదో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గ‌ర్భాశ‌యంలో ఎదుగుతున్న పిండానికి నిత్యం 300 క్యాల‌రీల శ‌క్తి అవ‌స‌రం అవుతుంది. అందుకని గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల‌కు బాగా ఆక‌లి వేస్తుంది. ఈ ల‌క్షణం క‌నిపించినా గ‌ర్బం దాల్చిన‌ట్టు అర్థం చేసుకోవాలి. గర్భం దాల్చిన మహిళలు త్వరగా అలసిపోతారు. ఎప్పుడు కూడా నీరసంగా కనిపిస్తారు. చిన్న చిన్న పనులు చేయడానికే చిరాకు పడుతుంటారు. ఇది కూడా ఒక ల‌క్ష‌ణం అని చెప్పాలి. గర్భం దాల్చారంటే మహిళ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. 

 

అందులో ఒకటి వక్షోజాల్లో మార్పు వస్తుంది. బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. నిపుల్స్ చుట్టూ ఉన్న ప్రదేశం వెడల్పుగా, నల్లగా మారుతుంది. అది గమనించాలి. డెలీవరి తర్వాత బిడ్డకు పాలివ్వడం కోసం బ్రెస్ట్ అలా మారుతాయి. అలాగే గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు త‌ర‌చూ మూత్రానికి వెళ్లాల్సి వ‌స్తుంది. ఎందుకంటే పిండం ఏర్ప‌డుతుండ‌డం వ‌ల్ల గ‌ర్భాశ‌యం మూత్రాశ‌యంపై ఒత్తిడి క‌లిగిస్తుంది. అదే విధంగా.. గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల‌కు నాలుక అంతా లోహ‌పూరిత‌మైన‌ట్టు అనిపిస్తుంది. అప్పుడు రుచి స‌రిగ్గా తెలియ‌దు. అయితే ఈ స్థితి కొన్ని రోజులే ఉంటుంద‌ట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: