ఆస్తా వర్మ స్ఫూర్తిగా..తల్లికి పెళ్లి చేయాలనుకుంటున్న మరో అమ్మాయి!!

Durga Writes
ఆస్తా వర్మ.. కరెక్టుగా ఒక నెల ముందు తన ఒంటరి తల్లికి పెళ్లి చెయ్యాలని నెట్టింట్లో హల్ చల్ అయినా సంగతి గుర్తుంది కదా. అచ్చం అలానే ఇప్పుడు ఆస్తా వర్మని స్ఫూర్తిగా తీసుకున్న ఓ అమ్మాయి తన 56 తల్లికి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంది. అచ్చం ఆమెలనే తనకు కాబోయి తండ్రికి షరతులు కూడా పెట్టింది. తన తల్లికి అందమైన వరుడు కావాలని, 55-60 ఏళ్ల మధ్యలో ఉండి, పూర్తిగా శాకాహారి అయి ఉండాలని, మద్యపానం అలవాటు ఉండకూడదని, ప్రేమించే తత్వం ఉండాలని ఆమె తన తల్లితో కలిసి తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టింది. 


అయితే ఆస్తా వర్మ కూడా తన 50 ఏళ్ళ తల్లికి 50 ఏళ్ళ వరుడు కావాలని కండిషన్లు పెట్టి ట్విట్ చేసింది. అయితే ట్విట్ చేసిన కొద్దీ క్షేణాల్లోనే ఆ ఫోటోలు, ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అచ్చం ఆ అమ్మాయిలనే ఈ మోహిని విగ్ అనే యువతీ ట్విట్ కి లైకులు, షేర్లు, రిట్విట్లు చేస్తున్నారు. కొందరు ఈ ట్విట్లను మెచ్చుకోగా మరికొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు తమకు తెలిసిన మంచి వరుడు పేర్లు చెప్తున్నారు. డైరెక్ట్ గా అకౌంట్ కి వారి వివరాలను పంపుతున్నారు. 


అయితే.. తల్లి రెండో పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించిన యువతులను చూస్తే ముచ్చటేస్తుంది. ఇలాంటి అమ్మాయిలను చూస్తే అర్ధం అవుతుంది. కాలం మారుతుంది.. తల్లిదండ్రులు కాదు పిల్లలే తల్లిదండ్రుల పెళ్లిలా గురించి పట్టించుకునే రోజులు వచ్చాయని. నిజమే ప్రతి ఒక్కరికి ఒక తోడు అవసరం. అబ్బాయికి వయసులో ఉన్నప్పుడే భార్య మృతి చెందితే పెళ్లిళ్లు ఎలా చేస్తారో... అమ్మాయికి కూడా వృధాప్యంలో తోడు అవసరం అనేది గమనించండి. ఎం మేమంతా లేమా అని మీకు డౌట్ రావచ్చు కానీ మీరు అంత మీ పిల్లలు మీ భార్య మీ సంపాదన గురించి ఆలోచించేకే సమయం సరిపోతుంది. ఇంకా తల్లిదండ్రల గురించి ఎం ఆలోచిస్తారు. 


Inspired from @AasthaVarma once again am putting an effort for my 56yr old mother.Looking for 55-60yr old vegetarian,non smoker, non drinker ,loving man and a father who is looking for a life partner and caring children. #Groomhunting #everyonedeservesaprtner #lookingfordad pic.twitter.com/1iDwCqJ08I

— mohini vig (@mohini_vig) November 10, 2019

Looking for a handsome 50 year old man for my mother! :)
Vegetarian, Non Drinker, Well Established. #Groomhunting pic.twitter.com/xNj0w8r8uq

— Aastha Varma (@AasthaVarma) October 31, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: