మహిళలూ.. పువ్వులతోనూ ఆరోగ్యం.. ఎలాగో చూడండి..!

Chakravarthi Kalyan

మహిళలకూ పువ్వులకూ విడదీయరాని అనుబంధం ఉంటుంది. పువ్వులను ఇష్టపడని మహిళలు ఉండరు.. మహిళలే కాదు..మన జీవితాల్లో పువ్వులకు ఎనలేని ప్రాధాన్యముంది. శుభాకాంక్షలు చెప్పాలన్నా, సంతాపం తెలపాలన్నా పుష్పగుచ్ఛంతో వస్తారు.పూలు లేని దేవుడి పూజ ఉండదు. సందేశాలను తెలియజెప్పడంలో, అలంకరణలో,ఎవరికి వారు చక్కని భావాల్ని నింపుకోవడంలో వీటి ప్రాధాన్యం ఎనలేనిది.


అయితే.. పువ్వులు ఎమోషనల్ గా, శారీరకంగా ఏవిధంగా ఫీలయ్యేలా చేస్తాయన్న అవగాహన అంతగా ఉండదు. పువ్వులలో 'హీలింగ్' గుణాలు అనేకం ఉంటాయి. తాజాపువ్వులు విభిన్న విధాలా ప్రభావితం చేస్తాయి. పువ్వులతో ఎమోషనల్ ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.చుట్టూ పూలున్నప్పుడు అనుకూల ఎమోషన్లు, సంతోషపూరిత ఆలోచనలు ఉంటాయి.


నిండురంగులపూలు, వాటి సువాసనలు భావోద్రేకాల పై అనుకూల ప్రభావాన్ని చూపుతుంటాయి. మానసికంగానూ మంచి ప్రభావాన్ని ఇస్తాయి. పువ్వులు యాంగ్జయిటీ, ఒత్తిడి, విచారం, డిప్రెషన్ లకు చెక్ చెపుతుంటాయి. వాటి అందం, రంగులు,సువాసనలు చక్కని వాతావరణాన్ని సృష్టించి ప్రతికూలభావాలు, ఆలోచనలను తగ్గిస్తాయి.


తాజా పువ్వులను ఇంట్లో ఉంచుకున్నా, లేదా పూతోట నడుమ వున్నా యాంగ్జయిటీ స్థాయిలుఇట్టే తగ్గిపోయి, సంతోషభావాలు కలుతాయన్న విషయాన్ని పరిశోధనలు, అధ్యయనాలు సైతం రుజువు చేశాయి. ఇక, పూలలో ఔషధ గుణాలకు లెక్కలేదు. అనేక రుగ్మతల చికిత్సలో ఉపకరిస్తుంది. ఉదాహరణకు గులాబీ, జీర్ణవ్యవస్థ సమస్య లను తగ్గించడంలో సహకరిస్తుంది. బంతిపూలలో యాంటీ సెప్టిక్ గుణాలుండి గాయాలను మాన్పుతాయి. కొన్నిరకాల పూలతోతయారై ఎసెన్స్, మైగ్రేన్, టెన్షన్ తలనొప్పుల నుంచి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. చూశారా పువ్వులతో ఎంత ఆరోగ్యం ఉందో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: