వెజ్- 65

Durga
కావాలిసిన పధార్థాలు : క్యారెట్ :1కప్పు ముక్కలు బీన్స్ : ½ కప్పు ముక్కలు  క్యాబీజీ :1 ½ కప్పు ముక్కలు క్యాప్స్ కమ్:3/4 కప్పు ముక్కలు కార్న్ ఫ్లొర్ పౌడర్ : 2 చెంచాలు.  అల్లం, వెల్లుల్లి పేస్టు : 2 చెంచాలు మిరియాలపొడి : చిటికెడు పచ్చిమిర్చి : పది కరివేపాకు : రెండు కట్లలు  పెరుగు : 2 కప్పులు రెడ్ ఆరెంజ్ కలర్ :చిటికెడు మైదా : 50గ్రాములు ఉప్పు : సరిపడ తయారీచేయువిధానం : కూర ముక్కలన్నింటినీ నీటిలో ఉడికించి చల్లారిన తర్వాత పిండి ఓ గిన్నెలో వేయాలి. వాటికి కార్న్ ఫ్లోర్, మైదా, ఉప్పు, అల్లం-వెల్లుల్లి ముద్ద, మిరియాలపొడి వేసి కలపి కరివేపాకు, నీరు కొంచెం వేసి ముద్దలా చేసుకొని వీటిని వేడి నూనెలో ఎర్రగా ఫ్రై చేయాలి. బాండీలో రెండు గరిటెలు నూనె పోసి కాగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి వేపి పెరుగు రెడ్ ఆరెంజ్ కలర్ కూడా వేసి కలిపి సన్నని మంట మీద పెరుగు సగం అయ్యే వరకు వేపి దీంట్లో వేపి ఉంచుకున్న ఉండల్ని వేసి కలపి ప్రై చేయాలి. తీసి ప్లేట్ లలో పెట్టి సాస్తో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: