ప్రాన్స్ పకోడి

Durga
కావలసినవి : ఫ్రాన్స్ 1 / 2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టేబుల్ స్పూన్ చిల్లి సాస్స్ : టేబుల్ స్పూన్ సోయా సాస్స్ : ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ : ఒక టేబుల్ స్పూన్ ఉప్పు : తగినంత కారం : ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి : అర కప్పు కార్న్ ఫ్లోర్ : అర కప్పు గుడ్డు : ఒకటి అల్లం వెల్లుల్లి ముక్కలు : ఒకటేబుల్ స్పూన్ ఎండు మిర్చి : నాలుగు  ఉల్లిపాయ : ఒకటి నిమ్మ కాయ : ఒకటి  తయారు చేసే విధానం:  ముందుగా ఫ్రాన్స్ మీడియం సైజువి తీసుకుని శుబ్రము గా కడగాలి.  వాటిని మద్యకు నిలువుగా చివర్లు కట్ చేయకుండా పొడవుగా వచ్చేటట్లు కట్ చేసుకోవాలి. వీటిని ఒక గిన్నె తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లి సాస్, సోయా సాస్, వెనిగర్ , ఉప్పు, కారం, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఒక గుడ్డు లోని తెల్ల సోన ను కూడా వేసి కలపాలి  అందులో ఫ్రాన్స్ వేసి కలిపి ఒక్కొక్కటి పిండిలో నుండి కాగుతున్ననూనె లో వేసి పకోడిలా మాదిరి వేయించాలి . ఇంకొక పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి అల్లం వెల్లుల్లి ముక్కలు, ఎండు మిర్చి, లావుగా కోసిపెట్టుకున్న ఉల్లి ముక్కలు వేసి కొద్దిగా వేగాక ఫ్రాన్స్ వేసి కలిపి నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: