విజయం మీదే: ఈ వ్యాపారంతో లాభాలే లాభాలు ?

VAMSI
తక్కువ పెట్టుబడితో  లాభాలను అందుకొని విజయాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారా ..!! వ్యాపార రంగం లో రాణించాలి అన్నది మీ కల అయితే ఎలా మొదలు పెట్టాలి ? ఏ వ్యాపారాన్ని ఎంచుకోవాలి ? అన్న సందేహాలతో సతమతం అవుతున్న వారికి ఇదో చిన్న సలహా. ఒకసారి ఆలోచించి చూడండి.
పెద్ద చదువులు చదివుతున్నప్పట్టికి చాలామంది ఇప్పటికీ నిరుద్యోగ సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. కొంత మంది దైర్యం చేసి ఏదైతే అదే అయింది అని సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ఎక్కువగా హోటల్స్, కూరగాయల వ్యాపారం, వంటి వ్యాపారాలు చేస్తున్నారు. అయితే నిజం చెప్పాలంటే ఇవి అందరికీ అంతగా కలిసి రావు. ఎందుకంటే... ఏరోజు వ్యాపారం ఆ రోజుదే ఒక్క రోజు ఫుడ్ లేదా కూరగాయలు మిగిలినా నష్టం పెద్ద ఎత్తునే వస్తుంది. అలాంటప్పుడు ఇది కాస్త రిస్క్ తో కూడుకున్న వ్యాపారమనే చెప్పాలి. అయితే మంచి సెంటర్, డిమాండ్ ఉంటే మాత్రం మీరు ఈ వ్యాపారం గురించి ఆలోచించడం లాభదాయకమే.  అప్పుడే ఆ వ్యాపారం నిలకడగా సాగుతుంది.
అలా కాకుండా నష్టాలు తక్కువగా ఉండే వ్యాపారమే ఎపుడు సేఫ్ అని చెప్పొచ్చు. బ్యూటీ ప్రొడక్ట్స్ కు సంబందించిన వ్యాపారాలకు ఈ మధ్య కాలంలో డిమాండ్ బాగా పెరిగింది. అదే విధంగా ఇమిటేషన్ జ్యుయలరికి కూడా డిమాండ్ చాలా ఎక్కువే. మంచి బ్యూటీ ప్రొడక్ట్స్ అలాగే క్వాలిటీ జ్యుయలరి కనుక మీ వద్ద ఉన్నట్లైతే ఇక జనం మీ షాప్ ముందు క్యూ కట్టాల్సిందే. ముందుగా వీటిని చెన్నై వంటి ప్లేస్ లో హాల్ సేల్ రేట్లకు మంచి క్వాలిటీ ఉన్న వాటిని కొనుగోలు చేయండి. ఆ తరువాత బిజినెస్ బాగా జరగ గలిగే స్కోప్ ఉన్న ప్రాంతంలో షాప్ ను పెట్టి కాస్త పబ్లిసిటీ పెంచితే సరిపోతుంది. మీ వ్యాపారం బాగా జరుగుతుంది. అలాగే మీకు అమ్ముడు పోని సరుకుని తిరిగి సప్లయర్ కు రిటర్న్ చేయడానికి డీల్స్ ను కూడా ముందే కుదుర్చుకోవడం వలన అమ్ముడు పోని వాటిని రిటర్న్ చేసి నష్టం రాకుండా చూసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: