విజయం మీదే: "కష్టం - అసాధ్యం" అనుకుంటే చీపురు పుల్లను కూడా కదపలేవు?
ఉదాహరణకు కొందరు తాము చేసే పనిలో సాకులు వెతుక్కుని దాటేస్తుంటారు. కొందరు ఏమో తాము చేసే పని చాలా కష్టం, ఇది అసాధ్యం అనుకుంటూ కాలాన్ని గడిపిస్తూ ఉంటారు. ఇలా పని చేయకూడదు అనుకునే వారికి ప్రతి పని ప్రతి సమస్య భారం గానే ఉంటుంది. మన లక్ష్యాన్ని సాధించడం మన బాధ్యత, ఎదురయ్యే అన్ని రకాల అనుభవాలను ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకోవడం మన సంకల్పం అనుకుంటే అన్ని సమస్యలు, కష్టాలు భారంగా కాదు మన లక్ష్యం కన్నా చాలా బలహీనంగా కనిపిస్తాయి. చూసే దృష్టి, ఆలోచించే కోణాన్ని బట్టి సందర్భానుసారంగా వచ్చే ప్రతి అనుభవం ఆ విధంగా కష్టమనో, సులభమనో కనపడుతుంది .
అందుకే ముందుగా ప్రయత్నమే కాదు మన ఆలోచన కూడా పాజిటివ్ గా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలం. కాబట్టి ఇప్పటి కైనా జీవితాన్ని సీరియస్ గా తీసుకుని మీరు చేసే ప్రతి పనిలో 100 శాతం కష్టపడండి. అలాగే మీరు చేసే పనిలో కష్టాలు ఎదురైతే వారికి పరిష్కారం కనుగొని ముందుకు సాగండి. అప్పుడే మీకు అనుకున్న ఫలితం దక్కుతుంది.