విజయం మీదే: నోరు మంచిదైతే చాలు... లేదంటే?

VAMSI
మాములుగా మనకు తెలిసో తెలియకో కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అది సహజమే ఇలాంటి వాటికి ఎవరూ ఏమీ అనుకోరు. కానీ కొన్ని మాత్రం మనకు తీరని దుఃఖాన్ని కలిగిస్తుంటాయి. వాటిలో ఒకటి కొందరికి ఉన్న అతి వాగుడు లక్షణం. మనిషికి సందర్భాన్ని బట్టి భావాలు మారుతుంటాయి. అయితే సందర్భం ఏదైనా కొన్ని సార్లు మన భావాలను మనం అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది, లేదంటే అవి మనల్ని ఇతరుల ముందు తక్కువ చేయడమో లేక మన అనుకున్న వాళ్ళకి మనం దూరమయ్యే పరిస్థితులను తీసుకురావడం వంటివి జరుగుతాయి.

ఉదాహరణకు మనకు నచ్చని పని జరిగినప్పుడు లేదా నచ్చని మాట విన్నప్పుడు ఎదుటి వారిపై చాలా సున్నితమైన కోపాన్ని ప్రదర్శిస్తాము. అలాంటి చాలా సున్నితమైన సమయంలో ఎదుటి వారి మనసు మరీ గాయపడేలా ప్రవర్తిస్తే బంధాలు తెగిపోయే ప్రమాదం లేకపోలేదు. అంత వరకు తెచ్చుకోవడం అవసరమా ? అని ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. కాబట్టి ఎప్పుడైనా, ఎక్కడైనా మీరు ఏదైనా మాట్లాడుతున్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ నుండి వచ్చే ప్రతి మాట ఎదుటి వారికి ఆవేశాన్ని తెప్పించేదిగా ఉండకూడదు. అయితే ఇంకొన్ని సార్లు మనకు తెలియకుండానే మన ప్రవర్తనతో ఎదుటి వారిని బాగా హార్ట్ చేస్తుంటారు.

కాగా వారిని మళ్ళీ యదాస్థితిలోకి అనగా మంచి మూడ్ లోకి తీసుకు రాలేకపోతే పూర్తిగా వ్యతిరేకత కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయితే అలాంటప్పుడు ఏమి చేయాలి అంటే  మీరు అన్నమాట గురించి ఒక్క సారి నవ్వుతూ చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. పైగా దాని వలన ఇబ్బందులు ఎదురు కావొచ్చు. వీలైనంత వరకు ఎదుటి వారికి నచ్చని విషయాలను మాట్లాడటం అసలు మొదలు పెట్టకండి. ఒకవేళ వారికి ఆ టాపిక్ నచ్చనట్లు అయితే మీరు ముగించడం సబబుగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: