విజయం మీదే: ఇలా చేస్తే విజయానికి దూరమైనట్టే?

VAMSI
ప్రతి ఒక్క మనిషికి పుట్టుకతో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇంకా కొన్ని పెరుగుతూ నేర్చుకుంటూ ఉంటారు. పని మొదలు పెడితే ఆపవద్దు, ఎక్కడా ఆగవద్దు మరియు మద్యలో వదిలి పెట్టొద్దు.  ఫలితం గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృదా చేయకుండా పని పూర్తి చేయడమే మనిషి పని అని అన్నారు మహా జ్ఞాని చాళుక్యుల వారు. అవును మనం ఎప్పుడూ లక్ష్యాన్ని చేరుకువాలనే ఆశతో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం.  వాటిలో ఒకటి మనం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని విజయం అందుకోవడానికి ముందుకు నడుస్తూ మద్యలో గెలుస్తామో లేదో అన్న ఆలోచనతో ఫలితం మనకు అనుకూలంగా రాదని భావించి ముందుగానే ఆ పనిని మధ్య లోనే వదిలి పెట్టేయడం.
అంటే ఒక లక్ష్యం అనుకున్న తరవాత  దానికోసం పాజిటివ్ గా ఆలోచిస్తూ ముందుకు నడవాలే తప్పా.. అలా కాకుండా అసలు ఈ పని మనం పూర్తి చేయగలమో చేయలేమో అనవసరంగా ఎందుకు వృధా ప్రయాస అనుకోని మధ్య లోనే నిలిపి వేస్తే ఆ పని ఎప్పటికీ పూర్తి కాదు. అదే విధంగా విజయం కూడా మీ చెంత చేరదు. ఏదైనా సరే స్వీకరించడానికి సిద్దంగా ఉండి అది మన కర్మ ఫలం అనుకుని మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రయత్నించాలి. సులువుగా
పొందే మంచి విజయానికి పెద్దగా గుర్తింపు లభించడం, అంతే కాకుండా మనశ్శాంతి కూడా ఉండదు.  
కాబట్టి మీరు మొదలెట్టిన ఏ చిన్న పనిని అయినా మధ్యలో వదిలి పెట్టకుండా పూర్తి చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది మీకు ఆజన్మాంతం ఉపయోగపడుతుంది. ఇప్పటికి ఏమీ మించి పోలేదు ఈ క్షణం నుండి మీరు తలపెట్టే ప్రతి పనిని పూర్తి చేయండి. ఈ క్రమంలో కష్టాన్ని మాత్రమే నమ్ముకోండి, ఊరికే ఏదీ రాదు. వచ్చినా అది మీకు శాశ్వతం కాదు అనే ఒక చిన్న సామెతను గుర్తించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: