విజయం మీదే: లక్ష్యం లేని వారి పరిస్థితి అంతేనా?

VAMSI
జీవితమనే ప్రయాణంలో ఎన్నో ఒడిదుడకులు ఎదురవుతుంటాయి. సుఖ సంతోషాలతో పాటు ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏవీ శాశ్వతం కాదన్న ఒక్క నిజాన్ని మనిషి గ్రహించి అర్దం చేసుకోగలిగితే జీవితంలో అంతా ఆనందమే. ప్రతి క్షణాన్ని ఆనందంగా మలచుకోవాలి, ఆ సమయాన్ని ఆస్వాదించగలగాలి అప్పుడే మనిషి ప్రశాంతంగా ఉండ గలడు. సుఖంగా సౌకర్యంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండటం గొప్ప కాదు. కష్ట సమయంలోనూ దైర్యంగా ఉంటూ ఆనందంగా ముందుకు సాగడం గొప్ప. ఇక ప్రతి మనిషికి ఖచ్చితంగా ఒక జీవిత లక్ష్యం అనేది ఉండాలి లేదంటే ఆ జీవితమే వృదా అని చాలామంది అంటుంటారు. కానీ ఈ మాట పూర్తిగా కరెక్టా అంటే కాదనే అంటున్నారు కొందరు విశ్లేషకులు.
మనిషికి లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యం ఉంటే ఆ వ్యక్తి ఒక దిశా మార్గాన్ని ఎంచుకుంటాడు. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతారు. లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆ వ్యక్తి ఆకాంక్ష పట్టుదలగా మారి అతడి జీవితానికి దారి చూపిస్తుంది. వారికంటూ ఒక గమ్యం, గమనం ఉంటుంది. అయితే అలాగని లక్ష్యం లేని వ్యక్తి ఎందుకు పనిరాడు అని కాదు, అలాగే అతడికి ఎలాంటి గమ్యము , గమనము ఉండదు అని కాదు.  మనం నిర్ణయించుకున్న, నిర్ణయించుకోకపోయిన జీవితం మనకు ఎన్నో సవాళ్లు ను విసురుతుంది.
మనిషి ఆ సవాళ్ళను అధిగమించి ప్రయాణాన్ని కొనసాగించక తప్పదు అలాంటప్పుడు జీవితం ఇచ్చే సవాళ్ళను పరిష్కారించడం కూడా ఒక లక్ష్యమే. ముందుగా అనుకుని మన గమ్యం ఇది అని నిర్ణయించుకుంటేనే లక్ష్యం కాదు...జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదిరించి సంతోషం వైపు సాగడం కూడా ఒక లక్ష్యమే.  జీవితం అంటే కేవలం ఆనందించడం మరియు అనుభవించడం కాదు కొత్త అనుభవాలను కూడా అభ్యసించి ముందుకు వెళ్లడం కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: