విజయం మీదే: ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా ?

VAMSI
ప్రస్తుత జనరేషన్ లో జీవితం సాఫీగా సాగాలంటే డబ్బులు తప్పనిసరి. ఆర్థికంగా బాగుంటేనే మన జీవితం అనుకున్న విధంగా సౌకర్యవంతంగా గడపగలం. అందుకే ప్రతి ఒక్కరి ప్రధాన లక్ష్యం డబ్బును సంపాదించడంగా మారిపోయింది. అందుకే అందరూ వ్యాపారాలు, ఉపాధి అంటూ పరుగులు తీస్తుంటారు. అందులోనూ ఎంతో సెక్యూర్ గా ఉండే గవర్నమెంట్ జాబులంటే మరింత ఆసక్తి కనబరుస్తారు. కొందరయితే ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని ఏళ్ల తరబడి ప్రయత్నిస్తుంటారు. చిన్నప్పటి నుండే పేరెంట్స్ కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలని పిల్లల్ని ఒత్తిడి చేస్తుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబు ని పొందడానికి మన మార్కుల పర్సంటేజ్ కూడా చాలా కీలకం.
ఇక గవర్నమెంట్ జాబ్ సాధించాలనేది చాలామంది కల. కానీ అందరికీ ఆ అదృష్టం వరించదు. ఎవరైతే ఖచ్చితంగా సాధించి తీరాలి అనే పట్టుదలతో ఒక ప్లానింగ్ ప్రకారం కృషి చేస్తారో వారు తప్పక అనుకున్నది సాధిస్తారు. అయితే గవర్నమెంట్ జాబ్ ను పొందడానికి  ఈ టిప్స్ ఉపయోగపడతాయని అనుకుంటున్నాము. ఇవి అనుభవజ్ఞులైన కొందరు పరిజ్ఞానవంతులు చెప్పిన మార్గ దర్శకాలు. అవేంటో ఇపుడు కాస్త తెలుసుకుందాం.
* గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అంటే అందుకు తగ్గ ప్రిపరేషన్ చాలా కీలకం.
* ఒక ప్రణాళికను మీరు జాబ్ కోసం సంసిద్ధం అవ్వాలి.
*మీరు ఎంచుకున్న జాబ్ కోసం ఒక టైం టేబుల్ ను వేసుకోవాలి పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉన్నా దానిని తప్పకుండా ఫాలో అవ్వాలి.
* జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడం తప్పనిసరి, రెగ్యులర్ గా న్యూస్ పేపర్ రీడింగ్  మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
*ఇంగ్లీష్ గ్రామర్ పై ప్రత్యేక దృష్టి పెట్టండి. సులభంగా అర్ధం చేసుకోవడానికి యు ట్యూబ్ లో అందుకు సంబంధించిన క్లాసులను వినండి.
* మాథ్స్ విషయానికొస్తే 20 లోపు ఎక్కములు ఖచ్చితంగా నేర్చుకోండి. స్క్వేర్ రూట్స్ ను కంఠోపాఠంగా అయినా సరే నేర్చుకోండి.
* ప్రస్తుత ప్రభుత్వ పదకాలు, స్కీమ్ లు గురించి అవగాహన ప్రదానం.
* సోషల్ లో ఇయర్స్ ని నేర్చుకునేటప్పుడు మీకు ఈజీగా ఉండే కొన్ని కొండ గుర్తులను పెట్టుకోండి.
*రాజ్యాంగం, భారత ఆర్థిక వ్యవస్థ వంటి విషయాల గురించి తెలుసుకోవాలి.
ఇలా పై విషయాలపై మీరు కనుక గ్రిప్ సాధిస్తే పోటీ పరీక్షలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: