విజయం మీదే: ఆశలు సహజమే... అత్యాశే ప్రమాదం ?

VAMSI
ప్రతి మనిషి జీవితంలో చిన్ని చిన్ని ఆశలు కోరికలు ఉంటాయి. ఇది చాలా సర్వ సాధారణమైన విషయం, అయితే ఆశలకు కూడా ఒక పరిమితి అనేది ఉంది, ఉండాలి కూడా. ఆ హద్దు దాటితే సమస్యలు తప్పవని పెద్దలు చెబుతున్న మాట. మనిషికి ఆశ ఉండొచ్చు. కానీ అత్యాస మాత్రం అస్సలు ఉండ కూడదు. ఉదాహరణకు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకోవడం ఆశ అవుతుంది. అందరి కన్నా మిన్నగా అగ్ర స్థానానికి చేరుకుని, అధికారాన్ని చూపించాలి అనుకోవడం అత్యాశే అవుతుంది.  ఇలాంటి అత్యాశల కారణంగా, సంతోషం లభించక పోగా, సమస్యలు పెరిగి జీవితమొక పద్మవ్యూహంలా తయారు అవుతుంది.
అప్పుడు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండక పోవచ్చు. అందుకే మన ఆశల యొక్క హద్దులను గుర్తుంచుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవాలి. మొదట్లోనే మన ఆశలపై నియంత్రణ ఉంచి మనసుని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మన జీవితం సాఫీగా ఎటువంటి చిక్కులు లేకుండా సామరస్యంగా ముందుకు పోతుంది. ఇలా కాకుండా అత్యాశకు పోతే, మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా మనకు సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. అంతేకాదు అత్యాస వలన జీవితంలో మనశ్శాంతి అనేది ఉండదు, ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా గడపడం కష్టమే అవుతుంది.
ప్రతి గడియ ఒక యుగంలా గడుస్తుంది. ఈ విషయాలను గ్రహించి, అత్యాశలకు పోకుండా ఉంటే జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఒక ఆశ మనిషిని కొంత దూరము తీసుకెళ్తుంది, కానీ అత్యాశ మనిషిని ఎంత దూరమయినా తీసుకెళ్తుంది. మనకు రోజుకు సరిపడా తినడానికి దొరికితే సంతోషం. అదే పెద్ద పెద్ద హోటల్ లో భోజనం చెయ్యాలి అనుకుంటే, దానికోసం డబ్బులు కావాలి. ఆ డబ్బు కోసం అడ్డదారులు తొక్కేవారు ఎందరో ఉన్నారు. అందుకే ఆశపడడం సహజం. అత్యాశ మరణం వరకూ తీసుకెళ్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: