విజయం మీదే: మార్చుకో నీవెంచుకున్న మార్గాన్ని ?

VAMSI

మన ఈ లోకంలో ఏమి జరిగినప్పటికీ లేదా మన వ్యక్తిగత జీవితములో ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ నిబ్బరంగా ముందుకు సాగక తప్పదు. జీవితమన్నాక ఆటు పోట్లు తప్పవు. కష్ట నష్టాలు రాకుండా ఉండవు. అలాగని సమస్యలు వస్తే కృంగిపోకూడదు, ఉన్నచోటనే ఆగిపోకూడదు. ఏది ఏమైనా ముందుకు సాగాలి. కష్టాల ఎడారిని దాటినపుడే సుఖాల ఒయాసిస్సు కనిపిస్తుంది. మనం పయనించే దారిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, మనం నడిచే పద్ధతి అని తెలుసుకునప్పుడే మీకు కష్టాలపై భయం ఉండదు. అలాగే మనము చేసే పనిలో అడ్డంకులు వచ్చినపుడు, చేసే పనిని ఆపేస్తే, అందులో మీ గొప్పతనం ఏముంటుంది. ఆపాల్సింది పనిని కాదు.
మీరు ఆ పనిని చేయడానికి ప్రయత్నించే విధానాన్ని మార్చుకోవాలి. అలాగే మన జీవితంలో సమస్యలు వస్తే ఆపాల్సింది జీవన ప్రయాణాన్ని కాదు. అంటే చాలా మంది సమస్యలకు భయపడి బ్రతకలేక, బ్రతకడం రాక అర్ధాంతంరంగా చనిపోతూ ఉంటారు. అలాంటి వారంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.  మార్చుకోవాల్సింది మన లక్ష్యం కాదు మనం ఎంచుకున్న పద్దతిని అని తెలుసుకో. అలా కాకుండా సమస్యలకు భయపడి మన లక్ష్యాన్ని విడిచి పెట్టకూడదు.  మద్య లోనే ఆపేసి మన రాత ఇంతేనని సరిపెట్టుకోకూడదు. మనకు అంత అదృష్టం లేదని నిరాశ చెందకూడదు. ఎపుడైతే ఆ సమస్యలను పరిష్కరించుకొని ఎదుర్కొని అధిగమించగలమో, అపుడే మనం కోరుకున్న విజయ శిఖరం మన కళ్ల ముందు కనబడుతుంది.  
ఇక్కడ అంగీకరించవలసిన విషయం ఏమనగా,  పరిస్థితులు కష్టాన్ని కలిగించినా మట్టుపెట్టి ముందుకు సాగితేనే మనం కోరుకున్న తీరం చేరుకోగలం. జీవితం అనేది ఒక యుద్ధం లాంటిది సాయశక్తులా చివరి వరకు పోరాడితేనే విజయం. మద్యలోనే నిష్క్రమిస్తే అపజయమే మిగులుతుంది. కాబట్టి మీరు స్లాక్ష్యాన్ని చేసుకునే సరైన మార్గాన్ని నిర్దేశించుకోండి, విజయం మీదవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: