విజయం మీదే: లైఫ్ లో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందా ?
నిర్ణయం తీసుకోవాల్సిన అంశం గురించి ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత జరగబోయే పరిణామాల గురించి అంచనా వేయగలగాలి. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయం మీకు నష్టం కలిగించేలా అస్సలు ఉండకూడదు. మనం తీసుకొనే ప్రతి నిర్ణయం మనకు ఉపయోగపడేలా ఉండాలి. అదే విధంగా ఇతరులకు హాని కలిగించేలా ఉండకూడదు. ఇలా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మీ ఉన్నత చదువుల కోసం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏ కోర్స్ తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు. మీరు ఆలోచించాల్సిన విషయం మీరు ఎందులో అయితే నిష్ణాతులు అయి ఉంటారో, ఏ సబ్జెక్ట్ లో అయితే మీకు ప్రావీణ్యం ఉంటుందో ముఖ్యంగా ఎందులో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఎంచుకోవడం మంచిది.
ఇలా ప్రతి విషయాన్ని పలు కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అన్ని విషయాలలో మరియు అన్ని సందర్భాలలోనూ మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పలేము. కాబట్టి మీకు క్లిష్టంగా అనిపించినా సమయంలో మీ మేలు కోరే వారినో, మీ కుటుంబ సభ్యులనో అడిగి వారి అభిప్రాయం తెలుసుకోవడం మంచిది.