విజయం మీదే : రోడ్డు కూడా లేని గ్రామం నుండి ఢిల్లీ స్థాయికి...!

VAMSI
సంకల్పం బలంగా ఉంటే ఎంతటి కష్టమైన పనైనా సాధించవచ్చని నిరూపించాడు ఒక సామాన్యుడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అతని లక్ష్యం ముందు చిన్న బోయాయి. ఫలితంగా ప్రభుత్వ సంస్థలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఈ అభివృద్ధికి, తన సక్సెస్ కి కారణాలేమైనా కావొచ్చు, కానీ వాటిని సాధించుకోవడానికి తను ఏర్పరుచుకున్న ప్రణాళికలు ఎంత ప్రధానమైనవో ఆలోచిస్తే అర్ధమవుతుంది. అయితే అతనెవరో తెలుసుకుందామా..అయితే కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ పైన ఒక లుక్కేయండి. అతని పేరు బుగత మురళీధరరావు, పాలకొండ మండలంలోని ఒక చిన్న పల్లెటూరు అరదలి. ఈయన తండ్రికి ఉద్యోగం పోవడం ...తరువాత వేరే కారణాల వలన అన్నయ్య ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అతనిని తీవ్రంగా కృంగదీసాయి.
ఇటువంటి పరిస్థితుల నుండి అతను ఎదిగిన విధానం చాలా మందికి స్ఫూర్తినిచ్చిందని చెప్పాలి.  వారి ఊరుకు కనీసం రోడ్డు సదుపాయం కూడా సరిగా లేదు. ఇటువంటి గ్రామం నుండి వచ్చిన మురళీధర్ రావు ఇప్పుడు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఫైనాన్స్ విభాగంలో చీఫ్ జనరల్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మురళీధర్ రావు తండ్రి కూడా పెద్ద కొడుకు చనిపోయినా అధైర్య పడకుండా చిన్న కొడుకుకి అన్ని విధాలా ధైర్యాన్ని ఇస్తూ వచ్చాడు. చిన్నప్పటి నుండి చదువులో ఎప్పుడూ ముందే ఉండేవాడు. ఆ తరువాత బి టెక్ లో సీటు సంపాదించి చదువును పూర్తి చేసాడు. అదే ఊపులో ఎం ఇ కూడా పూర్తి చేసాడు. సింగరేణిలో మొత్తంగా 30  సంవత్సరాలు వివిధ శాఖల్లో ఉద్యోగం చేశాడు.
ఆ తరువాత ఇది ఆయనకు సంతృప్తిని ఇవ్వకపోవడంతో,  జాతీయ స్థాయి ఉద్యోగం కోసం ఐ సి డబ్ల్యు ఏ పరీక్ష రాసాడు. అందులో 48 వ ర్యాంక్ రావడంతో, అయన ఇంతకుముందు సింగరేణిలో చేసిన సేవలకు గాను అతనిని ప్రభుత్వం జాతీయ రహదారుల శాఖకు తీసుకువచ్చింది. దీనిని బట్టి డబ్బు కన్నా చదువు ఎంతో ముఖ్యమైంది.. ప్రస్తుతం మురళీధరరావు ఢిల్లీలో ఉన్నా కూడా సొంతవూరిని ఎప్పటికీ మరిచిపోలేదు. తన అభివృద్ధికోసం తండ్రి పడ్డ కష్టాన్ని ఎప్పటికీ మరిచిపోలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: