విజయం మీదే : ఈ చిన్న పని చేస్తే ఏ పనిలోనైనా పెద్ద విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

ప్రతి ఒక్కరూ లైఫ్ లో, కెరీర్ లో సక్సెస్ కావాలని అనుకుంటూ ఉంటారు. కొందరు సక్సెస్ కోసం లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి విజయం సాధిస్తే మరికొందరు మాత్రం విలువైన సమయాన్ని వృథా చేస్తూ జీవితాంతం గతాన్ని తలుచుకుంటూ బాధ పడుతూ ఉంటారు. మనం ఏ పనినైనా మొదలుపెట్టే ముందు ఒక చిన్న పని చేస్తే పెద్ద విజయం సొంతమవుతుంది. ఏ పనినైనా చేసే ముందు అసలు ఆ పని ఎందుకు చేయాలనుకుంటున్నామో ఆలోచించాలి. 
 
ఆ ప్రశ్నకు వచ్చే సమాధానం సంతృప్తికరంగా ఉంటే ఆ పనిలో ముందుకెళ్లాలి. ఆ పని వల్ల ప్రయోజనం చేకూరుతుందంటే మాత్రమే ఆ పనులకు సమయం కేటాయించాలి. ప్రయోజనం లేని పనులకు సమయం కేటాయించడం వృథా అని గుర్తుంచుకోవాలి. స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం ద్వారా మనస్సు ఆ లక్ష్యానికి సంబంధించిన దారులను చూపెడుతుంది. మన మనస్సును సరిగ్గా వినియోగించుకుంటే జీవితంలో గొప్పగొప్ప విజయాలను సులభంగా సాధించవచ్చు. 
 
మొదట మనం జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ తరువాత ఏం చేస్తే ఆ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందో అందుకు తగిన ప్రణాళిక వేసుకోవాలి. వేసుకున్న ప్రణాళిక ప్రకారం అనుకున్న పనులను పూర్తి చేయాలి. సమయాన్ని, శక్తిని పూర్తిగా లక్ష్యం కోసమే ఉపయోగించాలి. అనుకున్న ప్రకారం లక్ష్య సాధన కోసం కృషి చేయాలి. 
 
లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులకు, ఆటంకాలకు భయపడి ఎవరైతే ముందడుగు వేయరో వారికి విజయం సాధించే అవకాశాలు తగ్గుతాయి. అలా కాకుండా ఎన్ని సమస్యలు వచ్చినా ఎవరైతే లక్ష్యం కోసం కృషి చేస్తారో వారికి సులభంగా విజయం సొంతమవుతుంది. ప్రతిరోజూ మన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. లక్ష్యాన్ని సాధించినట్లు ఊహించుకుంటూ ఉండాలి. ప్రతిరోజూ ఈ చిన్న పని చేయడం వల్ల శ్రమ, అవకాశాలు పెరగడంతో పాటు పెద్ద విజయాలు సొంతమవుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: