కాబోయే భర్తతో పివి సింధు.. ఫొటోస్ వైరల్..!
పీవీ సింధు తన కాబోయే భర్తతో కలిసి ఇటీవలే ఆమె డిన్నర్ కు సైతం వెళ్లినట్లుగా తెలుస్తోంది. తాజాగా కారులో వెళ్తూ అతనితో ఒక సెల్ఫీ కూడా తీసుకున్నది.. అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ నెల 22 న రాజస్థాన్లోని ఉదయపూర్ లో పీవీ సింధు వివాహం జరగబోతోందట. అలాగే ఈనెల 24 న హైదరాబాదులో రిసెప్షన్ కూడా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.. పీవీ సింధు చేసుకోబోయే వ్యాపారవేత్త ఎవరో కాదు పాసిడెక్స్ టెక్నాలజీస్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా పని చేస్తున్నారట.. ఈ విషయాన్ని ఆమె తండ్రి పివి రమణ తెలియజేయడం జరిగింది.
ఇరువురు కుటుంబాల కు ఎప్పటి నుంచో బాగా పరిచయం ఉన్నదని కానీ వివాహాన్ని మాత్రం నెల క్రిందమే ఖాయం చేసుకున్నామని జనవరి నుంచి తన కూతురు సింధు వరస టోర్నీలు ఆడబోతోంది అందుకే ఆమె సాధ్యమైనంత త్వరగా వివాహం చేయాలనుకున్నాము.. డిసెంబర్ 22న పెళ్లి వేడుకను ఫిక్స్ చేశామని తెలియజేశారు. ఇక డిసెంబర్ 20 వ తేదీ నుంచి సింధు పెళ్లి వేడుకలు సైతం మొదలు కాబోతున్నాయట. మొత్తానికి తన కాబోయే భర్తతో డిన్నర్ కి వెళితే ఒక ఫోటోని షేర్ చేయడంతో అభిమానులు కూడా ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ కంగ్రాజులేషన్స్ తెలియజేస్తున్నారు.