అతను ఏ మూడ్ లో ఉన్నాడో.. ఫ్రాంక్ చేసేందుకు వస్తే.. ఏం చేశాడంటే?

praveen
ఈ మధ్య కాలంలో అందరూ కూడా సోషల్ మీడియా అనే మాయలో మునిగీ తేలుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది కాలక్షేపం కోసం సోషల్ మీడియా చూస్తూ ఉంటే ఇంకొంతమంది పాపులారిటీ సంపాదించుకోవడం కోసం ఇలా సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. అయితే తమలో ఉన్న క్రియేటివిటీని ఏదో ఒక రూపంలో కొత్తగా నిరూపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో దారిని వెతుక్కుంటూ ఉంటారు.

 కొంతమంది ఏకంగా షార్ట్ ఫిలిం ద్వారా తమ టాలెంట్ నిరూపించుకుంటే ఇంకొంతమంది మరో దారిని ఎంచుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఏకంగా ఫ్రాంక్ వీడియోలు చేసి అమాయకపు జనాలను ఇబ్బంది పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని ఫ్రాంక్ వీడియోలు నవ్వుకునేలాగే ఉన్నప్పటికీ ఇంకొన్ని మాత్రం ఏకంగా బీపీ తెప్పించేలాగే ఉంటాయి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఇలాగే సైలెంట్ గా ఏదో ఆలోచిస్తున్న వ్యక్తితో ప్రాంక్ చేయాలి అనుకున్నాడు  కానీ చివరికి అతనికి ఊహించని చేదు అనుభవం ఎదురయింది.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక వ్యక్తి ఏకంగా నది వంతెన పై నిలబడి నీళ్లలోకి చూస్తూ ఏదో దీనంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే అదే సమయంలో ఒక వ్యక్తి ఫ్రాంక్ వీడియోల పేరుతో అందరి వద్దకు వెళ్లి చెవి దగ్గర హారన్ కొడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇక అక్కడ వంతెన పై నిలబడి ఏదో ఆలోచిస్తున్న వ్యక్తి చెవి దగ్గరికి వెళ్లి హారన్ కొడతాడు. దీంతో అతనికి ఒక్కసారిగా కోపం నషాలానికి అంటుకుంటుంది. ఇంకేముంది ఇలా ఫ్రాంక్ చేయాలనుకున్న వ్యక్తిని ఎత్తి నదిలో పడేస్తాడు. సార్ సార్ క్షమించండి ఇది ఫ్రాంక్ అని అరుస్తున్న అతను మాత్రం అప్పటికే నీటిలో పడేస్తాడు. అయితే ఇలా జనాలను ఇబ్బంది పెట్టే వారికి ఇలాగే కావాలి అంటూ ఎంతో మంది నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: