భూమిని చదును చేస్తుండగా బయటపడిన కూజా.. పగలగొట్టి చూస్తే?

praveen
సాధారణం గా కొన్ని కొన్ని సార్లు తవ్వకాలు జరుగుతున్న సమయంలో చారిత్రాత్మక ఆనవాళ్లు పురాతన వస్తువులు బయట పడుతూ ఉంటాయి. ఇక ఇవి దేశ చరిత్రకు ఆధారం గా చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎప్పుడైనా తవ్వకాలు జరుపుకున్నప్పుడు పురాతన వస్తువులు బయటపడ్డాయి అంటే చాలు ఇక కొంతమంది అత్యాశకు పోతూ ఉంటారు. ఇలాంటి వస్తువులలో నిధులు నిక్షేపాలు దొరుకుతాయని అనుకుంటూ ఉంటారు  కొంతమంది కేవలం నిధులు నిక్షేపాల కోసమే తవ్వకాలు జరపడం కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటుంది.

 ఇప్పుడైతే ఇలాంటి తరహా ఘటనలు తగ్గాయి. కానీ ఒకప్పుడు మాత్రం ఏకంగా గుప్త నిధుల కోసం పురాతన దేవాలయాలు వాటి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో చాలామంది తవ్వకాలు జరిపేవారు.  కొంతమంది ఏకంగా నిధి నిక్షేపాల కోసం క్షుద్ర పూజలు చేయడం, నర బలులు ఇవ్వడం  లాంటివి కూడా  ఒకప్పుడు జరిగేవి. ఈ మధ్యకాలంలో మాత్రం ఇలాంటివి తగ్గాయి. అయితే ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా పురావస్తు  అధికారులు తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒక వస్తువు బయటపడింది.

 అదేంట అనే గమనించి చూస్తే అది ఒక పురాతనమైన కూజా. దాని చుట్టూ మట్టి ఎక్కువగా ఉండడంతో అది బయటకు రావట్లేదు. దీంతో అతను ఆ కూజాను బయటకు తీయాలి అనే ఆలోచన మానుకొని అది భూమిలో ఉన్నప్పుడే పగలగొట్టాడు. అయితే ఆ కూజా లోపల గాజులు ఆభరణాలు లాంటివి దొరికాయి. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. అయితే ఆ కూజలో దొరికింది బంగారమా లేకపోతే రాగి లేదా ఇత్తడి వస్తువుల అనే విషయం మాత్రం తెలియ రాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: