వైరల్:వామ్మో ఈ వైరస్ సోకితే 8 రోజులకే మరణం..!!

Divya
కరోనా మహమ్మారి వల్ల ప్రజలలో ఒక అల్లకల్లోలం సృష్టించింది.. ఇప్పటికీ అలాంటి పరిస్థితులను తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడిప్పుడే అలాంటి పరిస్థితుల నుంచి కాస్త బయటపడుతున్న సమయంలో ఇప్పుడు ప్రపంచాన్ని సైతం షేక్ చేసే విధంగా మరొక వార్త వినిపిస్తోంది. కోవిడ్-19 కంటే ఒక ప్రమాదకరమైన వైరస్ ను చైనా తయారు చేస్తోందని అంతర్జాతీయ నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. గతంలో కరోనా వైరస్ చైనాలోని వుహన్ ల్యాబ్ నుండి.. ఈ వైరస్ వచ్చిందని ఆరోపణలు వచ్చినప్పటికీ ఈ విషయాన్ని చైనా ఖండించింది.

అయితే ఈసారి వస్తున్న వైరస్ మాత్రం చాలా ప్రమాదకరమని 100 కి 100% రెట్లు మరణ రేటు ఉంటుందని మీడియా నిపుణులు సైతం తెలియజేస్తున్నారు..వుహన్ లో ఈ విషయం వెళ్లడైనట్లుగా తెలుస్తున్నది. ప్రముఖ చైనా శాస్త్రవేత్తలు..SARS -COV-2 కీ చెందిన..GX-P2V అనే వైరస్ ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. 2017 లోనే వచ్చిన ఈ వైరస్ చాలా ప్రమాదకరమని గతంలో మలేషియా పాంగోలిన్లలో ఈ వైరస్ గుర్తించినట్లుగా తెలుస్తున్నది. అయితే ఈ వైరస్ ను ఎలుకల పైన ప్రయోగించే వారట.

అయితే అలా ఎలుకల మీద ప్రయోగించిన ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపించేదని అలా ఎనిమిది రోజులలోనే ఎలుకలన్నీ చనిపోయాయని అధ్యయనంలో తెలిపారు. అయితే ఈ వైరస్ కారణంగా ఎలుకలు ఊపిరితిత్తులకు కళ్ళు ,మెదడు, ఎముకలు సైతం దెబ్బతినేలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది. దీంతో బరువు ఒక్కసారిగా తగ్గిపోవడం బలహీనంగా మారడమే కాకుండా కొద్ది రోజులలోనే నడవలేని పరిస్థితికి వెళ్లిపోతారట. అలా ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుందట.ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా మనుషులకు వ్యాపిస్తే ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియదుకానీ... ఇది చాలా ప్రమాదకరమైన వైరస్ అంటూ పలువురు ఆరోగ్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం పైన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. WHO సమస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: