వైరల్: తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదైనవి ఎన్నో తెలుసా..?

Divya
కరోనా సమస్య కాస్త తగ్గింది అనుకునే లోపు మళ్ళీ ఇప్పుడు పలు దేశాలలో పలు ప్రాంతాలలో కూడా వీటి కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. కరోనా కొత్త వేరియంట్ jn -1 నిశ్శబ్దంగా విజృంభిస్తున్నట్లుగా వైద్యులు సైతం తెలియజేస్తున్నారు.. ఇప్పుడు ఈ కరోనా కేసులు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు తెలంగాణలో కొత్తగా 6 కేసులు వెలుగులోకి వచ్చాయి.. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు గుర్తించారు.

తాజాగా నమోదైన వాటిలో హైదరాబాద్ -4 మెదక్ రంగారెడ్డి జిల్లాలో ఒక్కో కరోనా కేసులు ఉన్నట్లుగా గుర్తించారు.. అయితే ఇది పాత వేరియంటా లేక సరికొత్త వేరీ అంట అనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది.. ప్రస్తుతం వీటిని కనుగొనేందుకు  జినోమ్ సీక్వెన్స్ కోసం ఈ నమూనాలను గుర్తించడానికి సైతం పూణేకి పంపించినట్లు తెలుస్తున్నది.అయితే మొదటిసారి వచ్చిన కరోనాతో భయపడలేదు కానీ రెండోసారి వచ్చిన కరోనా చాలామంది మృతి చెందడం జరిగింది.అంతేకాకుండా కరోనా వచ్చి పోయిన తరువాత చాలామందికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తాయని  వైద్యులు సైతం గుర్తించారు.

అయితే ఇప్పుడు వచ్చిన కరోనా అంత పెద్దగా ఎఫెక్ట్ ఏమీ చూపదని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.. పదేళ్ల లోపు పిల్లలు మహిళలు వృద్ధులు చాలా జాగ్రత్తలు వ్యవహరించాలని అధికారుల సైతం సూచిస్తున్నారు.. గడిచిన 24 గంటలలో 328 కరోనా పాజిటివ్ కేసులు కూడా దేశవ్యాప్తంగా నమోదయాయని.m మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3000కు పెరిగిందని తెలుస్తోంది.. ఈ కొత్త వేరియంట్ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎందుకంటే ఇది స్పైక్ ప్రోటీన్ బలంగా ఉందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఇది ప్రాణం తీసే అంత ప్రమాదకరమైనది కాదంటూ హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: