రక్త పింజరను పట్టుకోబోతే కళ్లలో విషం చిమ్మింది.. చివరికి?
అయితే నేరుగా పాములను చూసేందుకు భయపడిపోయే జనాలు అటు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే పాములకు సంబంధించిన వీడియోలు చూడడానికి మాత్రం తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. పాముల కదలికలు అవి దాడి చేసే విధానాన్ని చూసి ఆశ్చర్యం లో మునిగిపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది స్నేక్ క్యాచర్లు ఇక పాములను పట్టుకుంటున్నప్పుడు ఏమేం చేశారు అన్న విషయాన్ని కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేస్తున్నారు.
అయితే ఇండియాలో ఉండే అత్యంత ప్రమాదకరమైన పాములలో రక్తపింజర ఒకటి అన్న విషయం తెలిసిందే. ఒక్కసారి రక్తపింజర కాటు వేసింది అంటే ఆ మనిషి బ్రతకడం దాదాపు అసాధ్యం అని చెబుతూ ఉంటారు నిపుణులు. అయితే ఇక్కడ ఏకంగా స్నేక్ క్యాచర్ పైన రక్తపింజర దాడి చేసింది. ఏకంగా పొలాల్లో ఉన్న రక్తపింజరను పట్టుకున్నాడు స్నేక్ క్యాచర్. తెలంగాణలోని మెట్పల్లి సమీపంలో ఉన్న ఒక మిరప తోటలోకి రక్తపింజర వచ్చినట్లు స్నేక్ క్యాచర్కు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్ళాడు అతను ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న స్టిక్ సహాయంతో రక్తపింజరను పట్టుకుపోయాడు. ఈ క్రమంలోనే పట్టుకొని సంచిలో వేసే క్రమంలో రక్తపింజర ఏకంగా విషాన్ని చిమ్మింది. దీంతో స్నేక్ క్యాచర్ పక్కనే ఉన్న సహాయకుడి కంట్లో అది పడింది. అతన్ని వెంటనేకళ్ళు కడుక్కోమని స్నేక్ క్యాచర్ అక్కడ నుంచి పంపించాడు. అయితే ఆ విషం కంట్లో పడితే కళ్ళు మొత్తం పోతాయని స్నేక్ క్యాచర్ తెలపడం గమనార్హం.