వాస్కోడిగామా ఇండియాని కనుగోన్నాడా.. వాస్తవమెంత..!!

Divya
ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం మనకి నచ్చినట్టుగా ఉంటూ మనకు నచ్చిన పనులే చేస్తూ ఉన్నాము కానీ 1947 ఆగస్టు 15వ తేదీ ముందు వరకు ఇండియా పరిస్థితి ఇలా లేదు.. ఇండియా పేద దేశమా.. సంపన్న దేశమా .. నిజంగానే ఇండియాని వాస్కోడిగామా కనుగొన్నారా.. అసలు భారతదేశ చరిత్ర ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం..

భారతదేశం పచ్చని పాడి పంటలతో ఎంతో విలువైన భూగర్భ వనరులతో కల్మషం లేని వ్యక్తులతో విరజిల్లినటువంటి సంపన్న దేశంగా పేరు పొందింది.. ఆకలి అంటే అన్నం పెడుతూ సహాయం చేసేటువంటి దేశంగా కూడా పేరుపొందింది.. అయితే ప్రస్తుతం ఉన్న సాంకేతి పరిజ్ఞానంలో అంతరిక్షాన్ని అధిరోహించామని కూడా చెప్పుకుంటున్న దేశాలకి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వపు రుషులు కూడా అంతరిక్షాన్ని అందులో దాగి ఉన్న రహస్యాలను కూడా చేదించారని తాళపత్ర గ్రంధాలలో రూపొందించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. మన భూమి బల్లపరుపుగా ఉందని చివరికి వెళితే పడిపోతాం అనే విషయాన్ని చాలా మంది చెప్పగా కానీ మన పూర్వీకులు మాత్రం భూమి గుండ్రంగా ఉందని చెప్పారు.

సముద్ర మార్గంలో ప్రయాణిస్తూ దారి తప్పిపోయిన వాస్కోడిగామా సముద్రతీరంలో ఉన్న మన జాలర్లు చూసి అయ్యో అనుకోని ఇది మా దేశం.. పేరు భారతదేశం మీరు చాలా అలసిపోయి ఉన్నారు.. కానీ ఇక్కడ సేదతీరి కొద్దిసేపు వెళ్ళండి అంటూ ఆశ్రమం ఇచ్చారట.. అలా ఇవ్వడంతో అక్కడే కొద్దికాలం ఉండి తిరిగి వారీ దేశానికి వెళ్ళిపోయారు.. కానీ ఆ తరువాత కొద్ది రోజులకు సైన్యంతో తిరిగి భారతదేశంపై దండెత్తి వచ్చారట..

ఇలా మన దేశం పైన పోర్చుగీస్, డచ్ గ్రీక్, ఇలా ఎవరెవరో చాలా మంది దండెత్తి మన దేశాన్ని ఆక్రమించుకొని సంపదను కూడా దోచుకుపోయారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించారు. అలాంటి సమయంలోనే మనలో మనకి ఎన్నో గొడవలు పెట్టి బానిసలుగా కూడా చేసుకున్నారట. బ్రిటిష్ వాళ్ళ ఆకృత్యాలకు ఎంతోమంది మహిళలు కూడా బలయ్యారు.. దీంతో ఇండియన్స్ తట్టుకోలేక తిరగబడ్డారని ఇలా ఎన్నో ఉద్యమాలు చేశారని చివరికి అందరూ ఒకటే తెల్లదొరలని ఇండియా నుంచి తరిమికొట్టారని పురాణాలు తెలుపుతున్నాయి.. స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది అమరవీరులు ప్రాణ త్యాగం చేశారు.. 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి 12 గంటలకు స్వతంత్రాన్ని ఇస్తూ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: