
ప్యాసింజర్ రైలు ఇక కనుమరుగేనా..?
అలా ఇప్పటివరకు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం ప్యాసింజర్ రైల్స్ అనంతపురం , గుంటూరు విజయవాడ నుంచి తదితర ప్రాంతాల నుంచి కూడా ప్యాసింజర్ రైల్స్ ని తీసివేయడం జరిగింది.. దీంతో పేదల పైన ఆర్థిక భారం పడబోతోందని తెలుస్తోంది.. దాదాపుగా రూ.40 రూపాయలు ఎక్కువగా ప్యాసింజర్ రైల్స్ నుంచి ఎక్స్ప్రెస్ రైలుకు టికెట్ ధరలను పెంచడం జరిగింది. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ క్రమంగా తగ్గిచేస్తోంది. కొన్ని మార్గాలలో అసలు పూర్తిగా లేకుండా చేస్తోంది.. ఇప్పటివరకు ప్యాసింజర్ రైలుగా నడిచిన రైళ్లను అన్ రిజర్వుడ్ ఎక్స్ప్రెస్ స్పెషల్ ఎక్స్ప్రెస్లుగా మార్చి చార్జీలు పెంచేసింది.
కోవిడ్ కారణంగా రైళ్లు అన్ని నిలిపివేసిన రైల్వే శాఖ ఆ తర్వాత క్రమంగా పునరుద్ధరణ చేపట్టడం జరిగింది మొదట కేవలం రిజర్వేషన్ బోగీలతోనే స్పెషల్ ట్రైన్ పేరుతో ప్రత్యేక ఎక్స్ప్రెస్లను నడిపింది.ఆ తర్వాత పాత రైళ్లను పునరుద్ధరించి రైలను నడిపింది. వీటితోపాటు రైళ్లలో ప్రయాణించే వారి పైన కూడా అదనపు భారాన్ని వేసింది. మొత్తం అన్ని ఏరియాలలో కూడా ప్యాసింజర్ ట్రైన్లను తీసివేసి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లాగా మార్చారు. గుంటూరు డివిజన్ పరిధిలో కోవిడ్ ముందు వరకు 60 ప్యాసింజర్ రైల్స్ ఉండగా ఇప్పుడు ఒకటి కూడా లేదు.. అలాగే విజయవాడ డివిజన్ లో కూడా 129 ప్యాసింజర్ రైలు ఉండగా 26 ప్యాసింజర్లను పూర్తిగా రద్దు చేసింది. దీన్నిబట్టి చూస్తే రాబోయే రోజుల్లో ప్యాసింజర్ రైల్స్ ఉండేవి కష్టమే అని చెప్పవచ్చు.