వైరల్ : స్పూర్తినిచ్చే వీడియో.. ఒంటికాలితో ఛాంపియన్ అయింది?

praveen
ఇటీవల కాలంలో మనిషి బద్ధకస్తుడిగా  మారిపోతూ ఉన్నాడు. ఎందుకంటే కాళ్లు చేతులు సరిగ్గా ఉన్న మంచి చదువులు చదివిన దేవుడు తనకేదో తక్కువ చేశాడు అని దేవుడిని  నిందించడం మొదలు పెడుతూ ఉన్నాడు. కానీ కొంతమంది మాత్రం దేవుడు నిందించడం కాదు  ప్రాణం పోయడమే ఎక్కువ అన్నట్లుగా భావించి తమలో ఉన్న లోపాన్ని కూడా లెక్కచేయకుండా ఎన్నో గొప్ప విషయాలను సాధిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న పదానికి అసలు అర్థం చెబుతున్నారు ఎంతోమంది.

 ఇలా శరీరంలో ఉన్న అంగవైకల్యం వెక్కిరిస్తున్నప్పటికీ సభ్య సమాజం ముందు తలదించుకోకుండా ఏదో ఒకటి సాధించాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నారు ఎంతోమంది. ఇక ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు నేటి రోజుల్లో ట్విట్టర్ వేదికగా చాలానే వైరల్ గా మారిపోతున్నాయి. ఇలాంటి వీడియోలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొందుతున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక చిన్నారి ప్రతి ఒకరిలో కూడా సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఏదో సాధించాలని పట్టుదల వచ్చేలా చేస్తూ ఉంది అని చెప్పాలి.

 ప్రస్తుతం ట్విటర్ గా వైరల్ గా మారి పోయిన వీడియోలో చూసుకుంటే ఒక చిన్నారికి పూర్తిగా కాలు లేదు. అయినప్పటికీ ఆమె మాత్రం నిరుత్సాహపడలేదు. సాధన చేస్తే సాధించలేనిది ఏమీ లేదని.. పట్టుదలతో ముందుకు వెళ్తే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు అని నిరూపించింది. ఏకంగా స్కేటింగ్ చేస్తూ అదరగొట్టింది. నేషనల్ ఛాంపియన్గా నిలిచింది. అర్జెంటు నాకు చెందిన చిన్నారి పేరు మిలీ ట్రెజో. అడాప్టవ్ స్కేటింగ్ నేషనల్ ఛాంపియన్షిప్ లో పాల్గొని ఒంటికాలితో స్కేటింగ్ చేసి విజేతగా నిలిచింది. ఇలా ఒక్క కాలితో స్కేటింగ్ చేస్తూ తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆమె అద్భుత ప్రదర్శన చేయడం పై నేటిజన్స్ ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: