వైరల్ : జస్ట్ మిస్.. ఎంత ప్రమాదం తప్పింది?
ఇలా ఎక్కడో చిన్న ప్రదేశాలలో నక్కి ఉంటున్న పాములు కంటికి కనిపించకుండా ఉండి ఇక మనుషులు దగ్గరికి రాగానే పడగ విప్పి దాడి చేస్తూ కాటు వేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారి పోయింది. కేవలం క్షణకాల వ్యవధిలో ఒక వ్యక్తి ఏకంగా మృత్యువు నుంచి తప్పించుకున్నాడు అని చెప్పాలి. గోడ పక్కనే నక్కి ఉన్న పాము ఏకంగా ఒక విద్యార్థిని కాటు వేసేందుకు రాగా అదృష్టవశాత్తు అప్పటికే అతను కాస్త దూరం వచ్చేసాడు. దీంతో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు.
ఈ ఘటన కేరళ లోని కొల్లా జిల్లాలోని కోనతూరులో జరిగింది. స్కూల్ యూనిఫామ్ ధరించిన ఒక విద్యార్థి ఇంటి ముందు ఉన్న గేట్ దగ్గర నిల్చని ఉన్నాడు. కాసేపటికి లోపలికి వచ్చి గేటు మూసేస్తూ ఉన్న సమయం లో గోడ పక్కనే పాము ఉండడాన్ని గమనించాడు. అయితే వెంటనే ఒక అడుగు ముందుకు వేసి దూరం జరిగాడు. అంతలోనే పాము పడగవిప్పి కాటు వేయడానికి వచ్చింది. క్షణకాల వ్యవధి లో ఇక ఆ పాము కాటు నుంచి తప్పించుకున్నాడు విద్యార్థి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం అవ్వకపోతున్నారు. క్షణకాలం ఆలస్యమైన ఆ విద్యార్థి ప్రమాదంలో పడేవాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.