వైరల్ : పిల్లలను రక్షించేందుకు.. కోడి వీరోచిత పోరాటం?

praveen
తల్లి ప్రేమను మించినది ఏదీ లేదు అంటూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే 9 నెలల పాటు భారం అనుకోకుండా పిల్లలను కడుపులో మోయటమే కాదు నరకం లాంటి నొప్పిని అనుభవించి బిడ్డకు ఆనందంగా జన్మనిస్తుంది. ఇలా జన్మనిచ్చిన తర్వాత కూడా పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది అని చెప్పాలి. ఇక పిల్లలకు ఏదైనా సమస్య వచ్చిందంటే చాలు అపర కాళిలా మారిపోయి ఆ సమస్యను తరిమి కొడుతూ ఉంటుంది అని చెప్పాలి. కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు పక్షులలో కూడా అమ్మ ప్రేమ తగ్గదు అని చెప్పాలి. పిల్లలకు ప్రాణాపాయం ఉంది అని భావిస్తే ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి మరీ పిల్లలను కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి జంతువులు పక్షులు.

 ఇలాంటి తరహా వీడియోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ గా మారిపోయాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నో కోళ్లు పాములు వాటి పిల్లలను తినడానికి వచ్చిన సమయంలో వాటితో వీరోచితంగా పోరాటం చేయడం లాంటివి వీడియోలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా ప్రమాదకరమైన నాగుపాములు ఏకంగా ఆరడుగుల మనిషిని కూడా ప్రాణాలు తీసేయగలవు.

 ఇక అలాంటి కోబ్రా తో ఇటీవలే తన పిల్లల కోసం ప్రాణాలకు తెగించి పోరాడింది ఇక్కడ  ఓ కోడి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఓ యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో అప్లోడ్ చేశారు. పిల్లలతో కలిసి గూటిలో ఉంది కోడి. అంతలోనే అక్కడికి ఒక పెద్ద కోబ్రా వచింది. అయితే ముందుగానే తల్లి కోడి తన పిల్లలను దూరంగా నెట్టేసి కోబ్రా తో తలపడింది. ఇక పిల్లల వైపు కోబ్రా రాకుండా రక్షణ కల్పిస్తూ వచ్చింది. ఈ క్రమంలోని తనని తాను రక్షించుకుంటూ ఒకవైపు పామును పొడుస్తోంది. ఇక కోడి మెరుపువేగంతో దాడి చేయడంతో చివరికి పాము తోక ముడిచింది అని చెప్పాలి. ఇది చూసిన వారు తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: