వైరల్ : కార్ డోర్ తీయగానే.. కనిపించింది చూసి యజమాని షాక్?

praveen
ఒకప్పుడు పాములు పొదల్లో పొలాల్లో మాత్రమే ఉండేవి అని అనుకునేవారు. కానీ ఇటీవలి కాలంలో ఎక్కడ  నక్కి  ఉంటున్నాయి అన్నది కూడా తెలియని విధంగా మారిపోయింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతున్నారు ఎక్కడ పాములు దాగి ఉన్నాయో అని భయపడిపోతూ ఉన్నారూ  అని చెప్పాలి.  ఈ క్రమంలోనే కాస్త ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు.  ఇలాంటి సమయంలో కొంతమందికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.  ఏకంగా వాహనంలోకి విషపూరితమైన తాచుపాము దూరడం కొన్ని రోజులపాటు అక్కడే ఉండటం ఆ తర్వాత వాహనదారులు వాటిని గమనించడం లాంటి ఘటనలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.


 ఇక ఇటీవలే ఒక పాము  కారులోనే నివాసం ఏర్పాటు చేసుకుంది. ప్రతిరోజు కారులో నుంచి బయటకు వెళ్లడం ఆహారం తినడం అలవాటుగా మార్చుకుంది.  ఆ కారులోనే ఆ ప్రయాణికులు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళింది. ఒకసారి కారులో వింత శబ్దాలు రావడంతో ఏంటా అని చూడగానే అప్పుడు అసలు విషయం బయటపడింది. ఈ ఘటన కేరళలోని కొట్టాయం అర్పుకార  ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఇటీవలే లిఫ్ట్  ఆపరేటర్ గా పని చేసే సుజిత్ తన స్నేహితులతో కలిసి నెలరోజుల క్రితం వేరే ప్రాంతానికి  వెళ్ళాడు. కాగా  పార్క్ చేసి ఉన్న కార్ సమీపంలో ఒక పామును గుర్తించాడు.


 ఎందుకైనా మంచిదని కాస్త ముందు జాగ్రత్తగా కార్ మొత్తం వెతికాడు.   కానీ పాము  కనిపించలేదు.  కానీ రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కారులో పాము కుబుసం కనిపించడంతో కంగుతిన్నాడు.  స్నేక్ క్యాచర్  ను పిలిపించి కారు అంతా వెతికించాడు. ఇక ఆ తర్వాత రెండు రోజులకే పక్కనే ఉన్న కొబ్బరికాయపై పాము కనిపించింది. ఇక వెంటనే అధికారులు కు సమాచారం అందించగా స్నేక్ క్యాచర్ సంఘటనా స్థలానికి చేరుకుని పామును  రక్షించి  అడవిలో వదిలి పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: