వైరల్ : పాపం.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది?

praveen
నేటి రోజుల్లో యువత బైక్ పై చేసే విన్యాసాలు అన్నీ ఇన్ని కావు అని చెప్పాలి. ద్విచక్ర వాహనం చేతిలో ఉంది అంటే చాలు ఇక తమ కంటే తోపు ఇంకెవరూ లేరు అన్నట్లుగానే భావిస్తూ ఉంటారు.  నిబంధనలు పాటించి వాహనం నడపడం కాదు నిబంధనలకు విరుద్ధంగా అతివేగంగా బైక్ నడపడం లాంటివి చేస్తూ ఉంటారు.  మరికొన్నిసార్లు బైక్ తో ఎన్నో రకాల విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచటం చేస్తూ ఉంటారు. సాధారణంగానే అబ్బాయిలు బైక్ చేతిలో ఉంటే అస్సలు ఆగరూ అలాంటిది. ఇక వెనకాల ప్రియురాలు కూర్చునీ ఉంటే ఇక జోరుకి ఎవరికి బ్రేకులు వేయడం ఎవరి తరము కాదు అని చెప్పాలి.


 ప్రియురాలు వెనక కూర్చున్న సమయంలో ఏదో ఒకటి కొత్తగా విన్యాసం చేయాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రయ్యి రయ్యి మంటూ దూసుకు పోతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు చిత్రవిచిత్రమైన విన్యాసాలతో చివరికి ప్రమాదాలను తెచ్చి పెడుతూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ యువకుడు తన ప్రియురాలికి తన లో ఉన్న బైక్ డ్రైవింగ్ టాలెంట్ ఏంటో చూపించాలని భావించాడు. కానీ చివరికి అతను చేసిన స్టంట్స్ బెడిసికొట్టి ఊహించని రీతిలో ఇద్దరూ గాయాల బారిన పడ్డారు.


 ఇంతకీ ఏం జరిగిందంటే ఓ యువకుడు బైక్ పై తన ప్రియురాలితో కలిసి వెళ్తున్నాడు. ఇలా వెళుతున్న సమయంలో ఒక్కసారిగా బైక్ వేగం పెంచేశాడు. అంతటితో ఆగకుండా ప్రియురాలికి తన హీరోయిజాన్ని చూపించాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక విచిత్రమైన స్టంట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ అక్కడే అంతా బెడిసికొట్టింది ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి బొక్క బోర్లా పడింది. బైక్ నడుపుతున్న యువకుడు తో పాటు అతని ప్రియురాలు కూడా కారు అద్దాలు పగలగొట్టుకుని లోపల పడిపోవడం గమనార్హం. ఇక ఈ వీడియో కాస్త ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తోంది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: