మానవుల మాంసం టేస్ట్ తో బర్గర్.. ఎక్కడో తెలుసా..?

Satvika
ఫుడ్ ప్రియులను ఆకట్టుకోవడం కోసం హోటల్స్, ఫుడ్ సెంటర్స్ కొత్త కొత్త ప్రయోగాలను చేస్తున్నారు..అందులో భాగంగా కొందరు వెరైటీగా వంటలను చేస్తున్నారు. ఇటీవల కాలంలో వంటలకు సంభందించిన ఎన్నో వీడియో లు సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. వాటికి కొందరు ముగ్దులు అయితే,మరి కొంత మంది మాత్రం వాక్ ఛీ అంటున్నారు. అలాంటి ఓ వింత వంట ఇప్పుడు చక్కర్లు కోడుతుంది.. ఆ వంటకు అంత పేరు ఎందుకు వచ్చింది అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం...


ఓంఫ్' అనే స్వీడిష్ ఫుడ్ కంపెనీ.. హ్యూమన్ ఫ్లష్‌ను(మనిషి మాంసం) పోలి ఉండే మొక్కల ఆధారిత వెజ్ బర్గర్‌ తయారు చేసింది..చాలా రుచిగా వుండే ఆ వంట ఏంటో ఓ లుక్ వేసుకోండి.గత వారం జరిగిన కేన్స్ లయన్స్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో 'సిల్వర్ బ్రాండ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ యాక్టివేషన్ లయన్‌' అవార్డ్ గెలుచుకుంది. ఈ మేరకు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది.ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో అవార్డు గెలుచుకోవడం పట్ల కంపెనీ కోఫౌండర్, కార్పొరేట్ చెఫ్ అయిన అండర్స్ లిండెన్స్ ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపాడు. 'మనిషి మాంసాన్ని పోలిన రుచితో మొక్కల ఆధారిత బర్గర్ తయారు చేయడం పట్ల సంతోషంతో పాటు కొంచెం భయంగానూ ఉందని పేర్కొన్నాడు.


మొక్కలు ఉపయోగించి ఏ రకమైన ఫుడ్ అయినా తయారు చేయడం సాధ్యమవుతుందని చూపించడమే మా ప్రయత్నమని వివరించారు. కాగా ఈ బర్గర్ ఎక్కువగా సోయా, పుట్టగొడుగులు, గోధుమ ప్రోటీన్స్‌తో పాటు మొక్కల ఆధారిత కొవ్వులు, 'మిస్టీరియస్' మసాలా మిశ్రమంతో తయారు చేయబడింది..ఈ బర్గర్ ప్రజల ఆహార అలవాట్లను సవాల్ చేయాలని కోరుకుంటున్నట్లుగా ఓంఫ్ కంపెనీ గ్లోబల్ లీడర్ హెన్నిక్ అకెర్మా తెలిపారు. చిన్న బ్రాండ్ అయినప్పటికీ ఫుడ్ బౌండరీస్‌ను బ్రేక్ చేయాలనుకుంటున్నట్లుగా చెప్పారు. అయితే ఈ ఫుడ్ చాలా అద్భుతంగా ఉందని కొందరు భావిస్తుండగా కొందరు మాత్రం ఈ తల నొప్పి ఎందుకు అని అందరు భావిస్తూన్నారు మొత్తానికి అది అలా వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: