ఇదేం రివెంజ్ రా బాబు.. వీడు మనిషేనా?

Satvika
ఈరోజుల్లో ప్రేమ అని కొందరు తిరుగుతారు.. అనుకున్న కోరికలు తీరాకా ఇద్దరు కలిసి అనుకొని విడి పోతారు. అలా అనుకొని విడిపోయిన కూడా చాలా మంది తర్వాత కూడా పీడిస్తారు.కొంతమంది సైకోలుగా మారారు.. తాను ప్రేమించిన అమ్మాయిని మార్చిపొలెక దారుణాలను ఒడిగడుతున్నారు. ఇప్పుడు అలాంటి ఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది.తనకు బ్రేకప్ చెప్పిందనే కోపం తో ఓ యువకుడు తన ప్రేయసి పై సైకోయిజాన్ని చూపించాడు. తనను కాదన్నదని కిడ్నాప్ చేసి ఆమె ముఖంపై పెద్ద పెద్ద అక్షరాలతో తన పేరును టాటూగా వేశాడు.


బ్రెజిల్లో ని సావోపా లోకు చెందిన తయానే కాల్డాస్ అనే యువతి కొద్ది రోజుల క్రితం పాఠశాల కు వెళ్తుండగా ఆమె మాజీ ప్రియుడు గాబ్రియెల్ కోయెల్హో అడ్డగించాడు. బలవంతంగా తన కారులోకి ఎక్కుంచుకిని ఎక్కి తౌబాటే మున్సిపాలిటీ లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె ముఖం పై.. చెవి దగ్గరి నుంచి నోటి కింద వరకు బుగ్గపై తన పేరును టాటూ వేశాడు. తాను పచ్చబొట్టు వేసినందుకు తయానే సంతోషంగా ఉందని పేర్కొన్నాడు..తయానే తల్లి తన కుమార్తె కనిపించటం లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గాబ్రియెల్ ఇంట్లో యువతిని పోలీసులు గుర్తించారు.

 
కుమార్తెను ఇంటికి తీసుకెళ్లిన తల్లి ధైర్యం చెప్పి.. ఆమె మాజీ ప్రియుడిపై ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించారు. నిందితుడు గాబ్రియెల్ కోయెల్హోను శనివారం తమ అదుపులోకి తీసుకున్నారు.ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారగా ఆమెకు సాయం చేసేందుకు బ్రెజిల్లోని పలువురు కార్యకర్తలు, టాటూ తొలగించే దుకాణదారులు ముందుకు వచ్చారు. గత బుధవారం టాటూ ను తొలగించుకునేదుకు లేజర్ చికిత్సకు హాజరయ్యారు తయానే. తన శరీరంపై మాజీ ప్రియుడి పేరుతో ఉన్న మరో రెండు టాటూలను సైతం తొలగించుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది.. మొత్తానికి తను అతన్ని పూర్తిగా మర్చిపోనున్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: