Viral : ఆకట్టుకుంటున్న ట్రాఫిక్ స్నేహం! ఫిదా అవాల్సిందే!

Purushottham Vinay
స్నేహానికి అసలు వయసుతో సంబంధం లేదు. ఇక పసివాళ్ల స్నేహానికి పేద ఇంకా ధనిక అనే తారతమ్యాలు కూడా ఉండవు..అలాంటి ఘటనలు కేవలం నిజ జీవితంలోనే కాదు..అనేక సినిమాల్లో కూడా తరచూ చూస్తుంటాం..పేదింటి పిల్లలతో గొప్ప వారి పిల్లలు స్నేహం చేయటం అనేది వారి తల్లిదండ్రులకు తీవ్ర ఆగ్రహన్ని తెప్పిస్తుంది.ఇక అలాంటి సందర్భాల్లో తమ పిల్లలను పేదవారి పరిసరాల్లోకి కూడా వెళ్ల కుండా అడ్డుపడుతుంటారు. అయినప్పటికీ ఆ చిన్నారులు మాత్రం ఎలాగోలా తమ స్నేహాన్ని బాగానే కొనసాగిస్తుంటారు. అయితే, ఇక్కడ కూడా ఓ ఇద్దరు పసిపిల్లలకు సంబంధించిన ఓ వీడియో అయితే నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కల్లాకపటం ఎరుగని ఆ ఇద్దరు చిన్నారుల స్నేహం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌ అవుతోంది.ఇక సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో..అదో రద్దీగా ఉన్న ఒక రహదారి. ఆ రోడ్డుపై సిగ్నల్‌ పడినట్టుంది. ఇక భారీగా వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. అంతలోనే అక్కడ ఓ ఆగివున్న కారు వద్దకు ఓ పేద పిల్లవాడు వెళ్తాడు. 

ఆ కారులో ఉన్న పిల్లవాడు ఇక ఆ పేద బాలుడికి ఆడుకోవడానికి తన బొమ్మలను ఇచ్చాడు. వాటిని తీసుకుని ఆ పేద కుర్రాడు అదే రోడ్డుపై కాసేపు ఆడుకున్నాడు. ఆ కారులోని పిల్లవాడు అంతలోనే మరో బొమ్మను ఇచ్చాడు. అది కూడా అతను ఓ సారి ట్రైచేశాడు. రోడ్డుపై నిలబడి ఉన్న ఆ పేదబాలుడు ఇక ఆ తర్వాత ఆ బొమ్మలను తిరిగి ఇచ్చేస్తాడు.. కానీ ఆ కారులో ఉన్న ఆ బాలుడు వాటిని తీసుకోలేదు. కానీ ఆ వెంటనే ఆ పేద బాలుడు అక్కడ నుంచి వెళ్లి తినడానికి ఓ ప్యాకెట్‌ ఏవో స్నాక్స్‌ తీసుకొచ్చి కారులో ఉన్న ఆ కుర్రాడికి ఇస్తాడు. తర్వాత ఇద్దరు కూడా కలసి వాటిని తింటారు. కాసేపు ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటుంటారు. ఇక అంతలోనే అక్కడ ట్రాఫిక్ క్లియర్‌ అవుతుంది. తరువాత అక్కడ నుంచి ఆ కారు వెళ్లిపోతుంది..దాంతో ఆ ఇద్దరు కూడా టాటా చెప్పుకుంటారు. ఇదంతా పక్కనే ఉన్న మరో కారులోంచి కొంతమంది వీడియో తీశారు. దాన్ని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయటంతో వీడియో కాస్త వైరల్‌ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: