చవింది కొద్దిగా..సంపాదన 2 కోట్లు..గ్రేట్..

Satvika
డబ్బులు సంపాదించాలని అంటే మాత్రం పెద్ద చదువులు అవసరం లేదని గతం లో చాలా మంది నిరూపించారు.ఇప్పుడు కూడా మరో వ్యక్తి అతి తక్కువ చదివు.. కానీ అతను కోట్లు సంపాదిస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? ఒక సాఫ్ట్‌వేర్ కు రాని సంపాదన రావడం పై అందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలా అతను ఎం చేస్తున్నాడు అనే పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అమ్రోహా అనే ప్రాంతానికి చెందిన హర్వేంద్ర సింగ్ అనే యువకుడి కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి బ్రతుకుతున్నారు. రోజు పనికి వెళితే కానీ వాళ్ళకు నాలుగు వేళ్ళు నోటిలోకి వెళ్లవు..అలాంటి కుటుంబంలో పుట్టిన ఆ కుర్రాడు బాగా చదువుకోవాలి. మంచి ఉద్యోగం చెయాలని, తన కన్న తల్లి దండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలని అనుకున్నాడు. కానీ అతనికి ఆ అదృష్టం లేకుండా పోయింది.. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం తో చదువును ఆపెసారు. దాంతో తన చదువుకు తగ్గట్లు ఎదో చిన్న జాబ్ చేశాడు..అందులో వస్తున్న పైసలు చాలలేదు.. రెండు మూడు పనులు కూడా చేసాడు.


అయిన కూడా కుటుంబ పరిస్థితి మెరుగు అవ్వలేదు.తనకు ఒక ఆలోచన వచ్చింది. చేపల పెంపకం వల్ల మంచి లాభాలు వస్తాయని అనుకున్నారు.. ఈ విషయాన్ని కొందరికి చెప్పిన ఎవరూ వినలేదు..అతని అలొచనను ఎలాగైనా అమలు చేయాలని అనుకున్నాడు.ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకుని, చేపల పెంపకాన్ని ప్రారంభించాడు. మొదటి ఏడాది విపరీతమైన లాభాలు రాగానే తన పొలాల్లో కూడా చెరువులు ఏర్పాటు చేశాడు. నాలుగు ఎకరాల్లో ప్రారంభించిన చేపల పెంపకం.. ప్రస్తుతం 16 ఎకరాలకు విస్తరించింది.


ఇప్పుడు కాలుమీద కాలు వేసుకొని మరి సంపాదిస్తున్నారు.రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఇతని వద్దకు వస్తుంటారు. వారి నుంచి కొంత మొత్తాన్ని తీసుకుని సలహాలు, సూచనలు ఇస్తుంటాడు.. అంతటితో ఆగకుండా ఓ యూట్యూబ్ చానెల్ ను పెట్టి చేపల పెంపకం పై సూచనలు, సలహాలు ఇస్తున్నారు.. సంపాదనకు చదువు అవసరం లేదని నిరుపించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: