ఆ గుడిలో ప్రసాదం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

frame ఆ గుడిలో ప్రసాదం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Satvika
కొన్ని దేవాలయాలు చాలా ప్రత్యెకమైన పద్దతులను కలిగి వుంటాయి. వాటిని చూసిన వినినా కూడా ఆష్చర్యానికి గురి కావాల్సిందె.. ఇటీవల ఓ శివాలయంలో బ్రతికి వున్న పీతలను ప్రసాదంగా ఇస్తారని అన్నారు. ఇప్పుడు మరో వింత ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కొన్ని దేశాలలో కొన్ని రకాల సంప్రదాయాలు ఉంటాయి. మనదేశం చాలా పవిత్రమైనది.. అందుకే వివిధ రకాల సంప్రదాయాలు మన దేశం లో ఉన్నాయి. అంతేకాదు దేవతలకు నిలయం కూడా..కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చాలా దేవాలయాలు ఉన్నాయి.


ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.. ఒక్కో చరిత్రను కూడా కలిగి ఉంటుంది. ఇప్పుడు మరో గుడి ప్రత్యేకత గురించి చెప్పాలి.. ఆ గుడి చైనీస్ కాళిమాథా ఆలయం..పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని టెంగ్రా ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతాన్ని చైనా టౌన్ అని కూడా అంటారు. ఆలయానికి ఈ పేరు పెట్టడం వెనుక ప్రత్యేక కథ ఉంది. అప్పటి కాలంలో చెట్టు క్రింద రాల్లను పెట్టి పూజలు చెస్తున్నారు.. ఆ అమ్మవారు చాలా మహిమ కలిగిన అమ్మావరని వాళ్ళు చెబుథున్నారు.


స్థానికలు అందరూ కలిసి అమ్మవారికి గుడి కట్టించారు. రోజు రోజుకు ఆ ఆలయం ప్రత్యేకత ఉందని అందరు నమ్ముతున్నారు..విషయాన్నికొస్తే..ఒక చైనీస్ కుటుంబంలోని 10 ఏళ్ల పిల్లాడి ఆరోగ్యం విషమించింది. పిల్లవాడు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. దాంతో పిల్లాడి తల్లిదండ్రులు ఆ చెట్టుకింద పిల్లాడిని పడుకోబెట్టి పూజలు చేశారు.. అందరికి ఆశ్చర్యం కలిగించెలా ఆ పిల్లాడు బ్రతికాడు..దాంతో అతను చైనీస్ వంటలను చేస్తారు.. ఆ వంటలను ప్రసాదంగా పెట్టారు.ప్రసాదం రూపంలో కేవలం చైనీస్ ఆహార పదార్థాలు కనిపిస్తాయి. నూడుల్స్, చౌమీన్, ఫ్రైడ్ రైస్, మంచూరియన్ మొదలైన వాటిని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఆలయంలో ఉదయం, సాయంత్రం పూజలు, హారతి మొదలైనవి హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతాయి..ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: